13 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుని, ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు క్రియేట్ చేసిన యశస్వి జైస్వాల్ కోసం జోస్ బట్లర్ వంటి స్టార్ బ్యాటర్ కూడా వికెట్ సమర్పించుకోవడానికి వెనకాడలేదు. యశస్వి జైస్వాల్, క్రికెటర్ కాకముందు పానీ పూరీ అమ్మేవాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది...
29
కేకేఆర్‌తో మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్ తర్వాత కూడా అతను పానీపూరీ అమ్ముతున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజం కాదని అంటున్నాడు యశస్వి జైస్వాల్ చిన్ననాటి కోచ్ జ్వాలా సింగ్..
39
Image credit: PTI
‘వారణాసి నుంచి 50 కి.మీ.ల దూంలో ఉన్న బదోహిలో ఉన్న యశస్వి జైస్వాల్ కుటుంబాన్ని కలిశాను. జైస్వాల్ తండ్రి భూపేంద్ర, తల్లి కాంచన రోజూ కూలీ చేసుకుంటూ బతికివవాళ్లు. క్రికెటర్‌గా ఎదగాలని కలలు కన్న జైస్వాల్, 13 ఏళ్ల వయసులో తండ్రిని ఒప్పించి ముంబైకి మకాం మార్పించాడు..
49
Image credit: PTI
అజాద్ మైదాన్‌కి దగ్గర్లో ఉన్న ఓ చిన్న టెంట్‌లో జైస్వాల్ కుటుంబం ఉండేది. అక్కడ క్రికెట్ ఆడుతున్న జైస్వాల్‌ని మొదటిసారి చూశాను. నా స్నేహితులు కూడా జైస్వాల్ బ్యాటింగ్ టాలెంట్ గురించి చాలా చెప్పారు. మిగిలిన బ్యాటర్లు బ్యాటింగ్ చేయడానికి కష్టపడుతున్న పిచ్ మీద జైస్వాల్ అదరగొట్టాడు..
59
Yashasvi Jaiswal
అతన్ని పిలిచి ఎందుకని హైయర్ లెవెల్‌లో ఆడడం లేదని అడిగాను. అతను నాక్కూడా ఆడాలని ఉంది సర్, కానీ ఎవ్వరూ ఆడించుకోవడం లేదు. బయటి నుంచి వచ్చిన వాళ్లకి ముంబైకి ఆడే అర్హత లేదని చెప్పారని అన్నాడు. నాకు ఏం జరిగిందో అర్థమైంది..
69
Image credit: PTI
అతని దగ్గర అడ్రెస్ డాక్యుమెంట్లు కానీ, ముంబై వాసిగా ఆధార్ కార్డు కానీ లేదు. జైస్వాల్ కోసం తన తండ్రి ప్రతీ నెలా రూ.500-1000 పంపించేవాడు. వాటితో నెల మొత్తం గడిపేవాడు. అదే నాకు నా జీవితంలో పడిన కష్టాలను గుర్తు చేసింది..
79
వెంటనే జైస్వాల్‌ని నాతో వచ్చేయమని చెప్పాను. అతనికి కావాల్సిన అవసరాలన్నీ చూసుకుంటానని చెప్పాను. అప్పటి నుంచి అతనికి ట్రైయినింగ్‌తో పాటు అన్ని రకాల న్యూట్రిషన్స్ అందించాను. అతను పానీ పూరీ అమ్మేవాడని వార్తలు చదివినప్పుడు నాకు బాధగా ఉంటుంది..
యశస్వి జైస్వాల్‌కి పానీపూరీ బండి లేదు. నన్ను కలవడానికి ముందు ఓ పానీ పూరీ వ్యాపారి దగ్గర పనిచేసేవాడు. ఇప్పటికీ అతను అజాజ్ మైదాన్‌లో పానీ పూరీ బండి నడిపిస్తున్నాడు. అది కూడా నేను అతన్ని కలవడానికి ముందు, రోజూ ఖర్చులు సరిపోక అలా చేసేవాడు..
99
Sportzpics for IPL/PTI Photo)(PTI05_11_2023_000376B)
అతను కష్టపడ్డాడు, సక్సెస్ అయ్యాడు. దానికి గుర్తింపు కచ్ఛితంగా దక్కాల్సిందే. అంతేకానీ పానీ పూరీ వాలా, ఐపీఎల్ కిలాడీ అయ్యాడని లేని దాన్ని రాయడం కరెక్టు కాదు. నేను మొదటిసారి అతన్ని కలిసినప్పుడు క్రికెట్‌పై ఎంత ప్రేమ, కసితో ఉన్నాడో.. ఇప్పటికీ అతనిలో ఆ కసి ఉంది. అది చాలా గొప్ప విషయం...’ అంటూ చెప్పుకొచ్చాడు ముంబై మాజీ క్రికెటర్, ముంబై క్రికెట్ క్లబ్ వ్యవస్థాపకుడు జ్వాలా సింగ్..