‘నీ ఫేస్‌లో ఏ ఎక్స్‌ప్రెషన్ పలకదేంట్రా? ఎప్పుడూ ముఖం మాడిపోయినట్టు పెడతావ్’... వెస్టిండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ని చూసిన వాళ్లకి ఎవ్వరికైనా ఈ డైలాగ్ చాలా సార్లు గుర్తుకు వచ్చి ఉంటుంది... వికెట్ తీసినా, హ్యాట్రిక్ పడగొట్టినా, ఆఖరికి హాఫ్ సెంచరీ చేసినా నరైన్ ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఉండదు..
2023 సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సునీల్ నరైన్, బౌలింగ్‌లో బాగానే రాణించాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కి వచ్చిన సునీల్ నరైన్, 3.33 యావరేజ్‌తో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
28
2020 ఐపీఎల్ సీజన్ సమయంలో ఈ విండీస్ సీనియర్ ఆల్‌రౌండర్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అతనికి క్లియరెన్స్ దక్కడంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.. సునీల్ నరైన్ మాజీ భార్య ఓ భారత మహిళ అని తెలుసా...
38
క్రీజులో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్లు పలికించకుండా ఎంతో కామ్‌గా ఉండే సునీల్ నరైన్... నిజానికి రియల్ లైఫ్‌లో చాలా రొమాంటిక్...
సునీల్ నరైన్ భార్య పేరు నందితా కుమార్. విండీస్ ద్వీపంలో సెటిలైన ఓ భారతీయ మహిళ... సునీల్ నరైన్ 1986, మే 26న ట్రినాడ్ అండ్ టొబాకోలో జన్మించాడు. ఆరేళ్ల వయసు నుంచి క్రికెట్ ఆడుతూ దాన్నే కెరీర్‌ను మార్చుకున్నాడు సునీల్ నరైన్.
48
ఐపీఎల్‌తో పాటు బీబీఎల్, బీపీఎల్, సీపీఎల్, పీఎస్‌ఎల్, ఎల్‌పీఎల్.. ఎన్నో క్రికెట్ ఫ్రాంచైజీలకు ఆడిన సునీల్ నరైన్, 2013లో నందితా కుమార్‌ను పెళ్లాడాడు. సునీల్ నరైన్ కంటే అతని భార్య నందిత రెండేళ్లు పెద్దది...
58
భారతీయురాలైన నందిత, ట్రినాడ్‌లో చాలా ఏళ్ల క్రితమే సెటిల్ అయ్యింది. హిందూయిజాన్ని ఫాలో అయ్యే నందిత, దుర్గాదేవిని ఆరాధిస్తుంది... పేరులో సునీల్ అని ఉన్నప్పుడే చాలామందికి ఇది మనవాళ్ల పేరులా అనిపించొచ్చు. అవును, సునీల్ నరైన్ కూడా భారత సంతతికి చెందిన కుటుంబానికి చెందినవాడే.
68
నందిత, నరైన్ పెళ్లి హిందూ సంప్రదాయంలో జరిగింది. తమ మధ్య కెమిస్ట్రీని చూపిస్తూ సోషల్ మీడియాలో ఎంతో చనువుగా ఉన్న ఫోటోలను పోస్టు చేస్తుంటారు సునీల్ నరైన్, నందిత... అయితే పెళ్లైన ఏడేళ్లకు ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
78
నందితాతో విడాకుల తర్వాత సునీల్ నరైన్ ఏంజెలియా అనే మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరికి ఏడాదిన్నర కొడుకు కూడా ఉన్నాడు. అయితే వీరికి అధికారికంగా పెళ్లి అయ్యిందా? లేక లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నారా? అనే విషయంపై ఇప్పటిదాకా క్లారిటీ లేదు.
88
కేకేఆర్ తరుపున గత సీజన్లలో ఫెయిల్ అయిన వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి ఈ సీజన్‌లో ఫామ్‌లోకి వచ్చారు. సునీల్ నరైన్ బాల్‌తో అదరగొడుతున్నా, బ్యాటుతో మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. బ్యాటుతోనూ అదరగొడితే కేకేఆర్‌కి ఎదురుండదు..