ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్‌ని ఓడించి, టాప్ 3లోకి దూసుకొచ్చింది ముంబై ఇండియన్స్. ముంబై కేవలం బెస్ట్ ప్లేయర్లను కొని, వారితో గెలుస్తుందని వ్యాఖ్యానించిన హార్ధిక్ పాండ్యాకి బేస్ ప్రైజ్ కుర్రాళ్లతో ఓడించి పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చాడు రోహిత్ శర్మ..
సూర్యకుమార్ యాదవ్ సంచలన సెంచరీతో పాటు 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన విష్ణు వినోద్, అందరినీ ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు విష్ణు వినోద్..
28
VISHNU VINOD
29 ఏళ్ల విష్ణు వినోద్, ఈ మ్యాచ్‌కి ముందు 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఐపీఎల్ ఆరంగ్రేటం చేశాడు. ఆ సీజన్‌లో 3 మ్యాచులు ఆడి 19 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు... ఆ తర్వాత వరుసగా మూడు సీజన్లలో విష్ణు వినోద్‌కి ఏ ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు.
38
vishnu vinod
ఆ తర్వాత 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు, 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.50 లక్షలకు విష్ణు వినోద్‌కి కొనుగోలు చేశాయి. అయితే రెండు టీమ్స్ కూడా విష్ణుకి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు..
48
vishnu vinod catch
గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడి రూ.50 లక్షలకు విష్ణు వినోద్‌ని కొనుగోలు చేయడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందని అనుకున్నారంతా. అయితే ఎప్పటిలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్, అతన్ని రిజర్వు బెంచ్‌లోనే కూర్చోబెట్టింది..
58
sanju vishnu vinod
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌కి ముందు ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా క్రీజులోకి వచ్చి, కళ్లు చెదిరే క్యాచ్‌తో ఫాఫ్ డుప్లిసిస్‌ని అవుట్ చేశాడు విష్ణు వినోద్..
68
ishan vishnu vinod
గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడి రూ.50 లక్షలకు విష్ణు వినోద్‌ని కొనుగోలు చేయడంతో అతనికి తుది జట్టులో చోటు దక్కుతుందని అనుకున్నారంతా. అయితే ఎప్పటిలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్, అతన్ని రిజర్వు బెంచ్‌లోనే కూర్చోబెట్టింది..
78
Vishnu Vinod
కేరళ రాష్ట్రానికి చెందిన విష్ణు వినోద్, దేశవాళీ టోర్నీల్లో 42 టీ20 మ్యాచులు ఆడి 33.90 సగటుతో 1051 పరుగులు చేశాడు. ఇందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 23 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 38 లిస్టు ఏ మ్యాచులు ఆడిన విష్ణు వినోద్, 7 హాఫ్ సెంచరీలు, 5 సెంచరీలతో 2300లకు పైగా పరుగులు చేశాడు..
88
Brian Lara and Vishnu Vinod
2021-22 సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో తమిళనాడుతో మ్యాచ్‌లో 7 సిక్సర్లతో 26 బంతుల్లో 65 పరుగులు చేసిన విష్ణు వినోద్, అదే ఏడాది జరిగిన విజయ్ హాజారే ట్రోఫీలో సెంచరీ బాదాడు. అయినా అతనికి తుది జట్టులో చోటు ఇవ్వలేదు సన్‌రైజర్స్ హైదరాబాద్..