ఐపీఎల్ 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది ముంబై ఇండియన్స్. జస్ప్రిత్ బుమ్రా తప్ప మరో స్టార్ బౌలర్ లేకపోవడం ముంబై ఇండియన్స్‌ని బాగా ఇబ్బంది పెట్టింది. ఈసారి అతను కూడా గాయపడడంతో ముంబైకి మరోసారి ఆఖరి ప్లేస్ ఖాయమనుకున్నారంతా..
అనుకున్నట్టుగానే మొదటి 10 మ్యాచుల్లో 5 పరాజయాలను అందుకుంది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం, భారీ అంచనాలు పెట్టుకున్న జోఫ్రా ఆర్చర్ ఆడిన మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ కావడం, గాయంతో సీజన్ నుంచి దూరం కావడంతో ముంబై ఈసారి కూడా అస్సామే అనుకున్నారంతా..
26
Image credit: PTI
అయితే ఊహించని విధంగా వరుస విజయాలతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది రోహిత్ సేన. ముంబై బౌలర్లు వరుసగా 4 మ్యాచుల్లో 200+ స్కోరు అందించారు. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో 199 పరుగులు సమర్పించేశారు. అయితే బౌలింగ్ వీక్‌గా ఉంటే, బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్‌గా ఉండడంతో ముంబై ఇండియన్స్.. టాప్ 3లోకి దూసుకొచ్చింది..
36
(PTI Photo/Kunal Patil) (PTI05_09_2023_000386B)
రూ.17.5 కోట్లు పెట్టి కొన్న కామెరూన్ గ్రీన్‌తో పాటు కోట్లు పెట్టి కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్ల కంటే బేస్ ప్రైజ్ రూ.20 లక్షలతో టీమ్‌లోకి వచ్చిన కుర్రాళ్లు, అదిరిపోయే ఆటతీరుతో ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు..
46
Image credit: PTI
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన విష్ణు వినోద్, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ఆకాశ్ మద్వాల్, 3 ఓవర్లలో 2 వికెట్లు తీసిన కుమార్ కార్తీకేయ, ఆర్‌సీబీతో మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీ సాధించిన నేహాల్ వదేరా... ఈ నలుగురు కూడా బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు ముంబై టీమ్‌లోకి వచ్చినవాళ్లే..
56
vishnu vinod catch
హార్ధిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ కేవలం స్టార్ ప్లేయర్లనే కొనుగోలు చేస్తుందని కామెంట్ చేసిన తర్వాత అతని టీమ్‌ని బేస్ ప్రైజ్ కుర్రాళ్లతో ఓడించి, అదిరిపోయే బదులు ఇచ్చాడు రోహిత్ శర్మ.. ఇప్పటిదాకా చాలామంది రోహిత్ శర్మకు మంచి టీమ్ దొరకడం వల్లే సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అవుతూ వచ్చాడని విమర్శలు చేశారు..
66
tiago ev nehal
అయితే ఈ సారి టీమ్‌లో ఒక్క స్టార్ బౌలర్ కూడా లేకుండా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరితే... రోహిత్ శర్మ ఆ విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చినట్టే అవుతుంది.