అప్పుడు భువీ పర్పుల్ క్యాప్ గెలిస్తే, నేను వెళ్లి తీసుకున్నా! ఇన్నాళ్లకు... మహ్మద్ సిరాజ్ ఎమోషనల్...

Published : Apr 21, 2023, 10:10 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మహ్మద్ సిరాజ్ సెన్సేషనల్ బౌలింగ్‌తో ఇరగదీస్తున్నాడు. మిగిలిన ఆర్‌సీబీ బౌలర్లు అందరూ భారీగా పరుగులు ఇస్తూ, టీమ్‌ పరాజయాలకు కారణం అవుతుంటే సిరాజ్ ఒక్కడూ మంచి ఎకానమీతో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు...

PREV
16
అప్పుడు భువీ పర్పుల్ క్యాప్ గెలిస్తే, నేను వెళ్లి తీసుకున్నా! ఇన్నాళ్లకు... మహ్మద్ సిరాజ్ ఎమోషనల్...
PTI Photo/Atul Yadav) (PTI04_20_2023_000208B)

ఐపీఎల్ 2023 సీజన్‌లో 6 మ్యాచుల్లో 12 వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్, ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసిన సిరాజ్, ఐపీఎల్‌లో బెస్ట్ పర్ఫామెన్స్ నమోదు చేశాడు...

26
Mohammed Siraj

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు సమర్పించిన మహ్మద్ సిరాజ్, మిగిలిన మ్యాచుల్లో 1/21, 3/22, 2/23, 1/30, 4/21 గణాంకాలు నమోదు చేసి బెస్ట్ ఇండియన్ బౌలర్‌గా నిలుస్తున్నారు...
 

36
PTI Photo/Shailendra Bhojak)(PTI04_17_2023_000261B)

‘2016లో నేను సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి నెట్ బౌలర్‌గా ఉన్నా. ఆ సీజన్‌లో భువనేశ్వర్ కుమార్ ఆరెంజ్ క్యాప్ గెలిస్తే, అతనికి బదులుగా నేను వెళ్లి పర్పుల్ క్యాప్ అందుకున్నా... 

46
Image credit: PTI

ఆ పర్పుల్ క్యాప్ అందుకున్న క్షణానే అనుకున్నా, నేను కూడా ఎప్పుడో ఒకసారి దీన్ని గెలవాలి అని. ఇప్పుడు దీన్ని పెట్టుకోవడం చాలా స్పెషల్ ఫీలింగ్.. ’ అంటూ కామెంట్ చేశాడు హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్..

56
Image credit: PTI

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కొన్నాళ్ల క్రితం చనిపోయిన హైదరాబాద్ క్రికెటర్ అబ్దుల్ అజీజ్‌కి అంకితం ఇచ్చాడు మహ్మద్ సిరాజ్....

66
Mohammed Siraj

‘డియర్ అజీమ్ సర్. నాలాంటి ఎందరో క్రికెటర్లకు మీరు అండగా నిలిచి, ప్రోత్సాహించారు. మీరు అన్నివేళలా అందుబాటులో ఉంటూ, ఏ సాయం అడిగినా చేసేవారు. మిమ్మల్ని కలిసినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మిమ్మల్ని కడసారి చూపుకి కూడా నోచుకోలేకపోయా. నేను ఈ రోజు గెలిచిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ మీకే అంకితం చేస్తున్నా...’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు మహ్మద్ సిరాజ్..

click me!

Recommended Stories