ఎవరి ఇష్టం వాళ్లది! ఇష్టం లేకున్నా మీ కోసం ఆడాలా? ధోనీ రిటైర్మెంట్‌పై మురళీ విజయ్ కామెంట్...

First Published Apr 20, 2023, 6:15 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పూర్తిగా క్రికెట్‌కి వీడ్కోలు పలకబోతున్నాడు. ఇప్పటికే రిటైర్మెంట్ గురించి పరోక్షంగా హింట్స్ కూడా ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...  అయితే ప్రతీ మ్యాచ్ సమయంలో ధోనీకి దీని గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంది.

PTI PhotoShailendra Bhojak)(PTI04_17_2023_000367B)

ఐపీఎల్ 2023 సీజన్‌తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పూర్తిగా క్రికెట్‌కి వీడ్కోలు పలకబోతున్నాడు. ఇప్పటికే రిటైర్మెంట్ గురించి పరోక్షంగా హింట్స్ కూడా ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ... 
 

2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అట్టర్ ఫ్లాప్ అయినా 2021 సీజన్‌లో నాలుగోసారి టైటిల్ గెలిచి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకున్న ధోనీ సేన, ఈసారి మొదటి 5 మ్యాచుల్లో 3 విజయాలు అందుకుంది...

Latest Videos


‘రిటైర్మెంట్ అనేది ప్రతీ ప్లేయర్ వ్యక్తిగత విషయం. ఇష్టం లేకపోయినా తమ కోసం ఆడాలని జనాలు ఒత్తిడి చేయకూడదు. ధోనీ, 15 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇకనైనా తన ఇష్టం వచ్చినప్పుడు తప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలి...
 

ఇష్టం లేకపోయినా అభిమానుల కోసం ఆడాలని కోరడం కరెక్ట్ కాదు. ధోనీ ఎక్కడికి వెళ్లినా రిటైర్మెంట్ ఎప్పుడు? అనే ప్రశ్న వస్తోంది. ఎప్పుడు చెప్పాలో మాహీకి తెలుసు. ఇలా ప్రతీసారీ అడిగి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు... ధోనీ రిటైర్మెంట్ గురించి అడుగుతున్న ప్రతీ ఒక్కరికీ ఇది చెబుతున్నా..

ఇలా ధోనీ రిటైర్మెంట్ గురించి చెప్పడం నాక్కూడా ఇబ్బందిగా ఉంది.. నేను ఈ మధ్యనే రిటైర్మెంట్ తీసుకున్నా కాబట్టి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. గేమ్ కోసం అన్నీ ఇస్తాం, ఆటే జీవితం అని అనుకుంటాం...

అయితే ఓ సమయం వచ్చాక అన్నీ వదిలేయాల్సి ఉంటుంది. అది పూర్తిగా వ్యక్తిగత విషయం. దాంట్లో కలగచేసుకోవడం కరెక్ట్ కాదు...కాబట్టి కాస్త మీ హద్దులు తెలుసుకుని వ్యవహరించండి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ విజయ్...

click me!