కాగా పంజాబ్ ఓటములపై టీమిండియా మాజీ ఓపెనర్, గతంలో పంజాబ్ కు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరన్ ను వేలంలో కొన్న నగదు విలువను ఉద్దేశిస్తూ.. రూ. 18.50 కోట్లు పెట్టినంత మాత్రానా అనుభవాన్ని కొనలేమని చెప్పాడు. ఆర్సీబీతో మ్యాచ్ లో లేనిపరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాక కరన్ పై వీరూ ఫైర్ అయ్యాడు.