ఐపీఎల్‌లో ‘గోట్’ ఆ ఇద్దరే..! ఎంత ఆర్సీబీ అయితే అతడి పేరే చెప్పాలా కోహ్లీ..

Published : Apr 21, 2023, 05:04 PM IST

IPL 2023: ఇండియన్  ప్రీమియర్ లీగ్ ఇటీవలే 15 వసంతాలు పూర్తి చేసుకుని  16వ ఎడిషన్ లోకి అడుగుపెట్టింది. ఈ 16 ఏండ్ల ప్రయాణంలో ఎంతో మంది గొప్ప ప్లేయర్లు  ఈ లీగ్  లో చెరగని ముద్ర వేసుకున్నారు.  

PREV
16
ఐపీఎల్‌లో  ‘గోట్’ ఆ ఇద్దరే..! ఎంత ఆర్సీబీ అయితే అతడి పేరే చెప్పాలా కోహ్లీ..

2008 సీజన్ లో మొదలైన  ఐపీఎల్ 16 ఏండ్లుగా  అభిమానులను విశేషంగా అలరిస్తున్నది.   గత తరంలో  క్రికెట్ లో సూపర్ స్టార్లు గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, షాన్ పొలాక్, రికీ పాంటింగ్,  షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, సౌరవ్ గంగూలీ  లు  ఈ లీగ్  నాలుగైదు సీజన్స్ వరకూ  మెరుపులు మెరిపంచారు. 

26

ఇక ఆ తర్వాత ఎంఎస్ ధోని,  క్రిస్ గేల్,  కుమార సంగక్కర, వీరేంద్ర సెహ్వాగ్, షేన్ వాట్సన్, లసిత్ మలింగ, ఏబీ డివిలియర్స్,  బ్రావో, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ఈ లీగ్ ను  గత దశాబ్దకాలంగా మరింత రసవత్తరంగా  మారుస్తున్నారు. గత రెండు మూడు సీజన్లుగా  శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్  వంటి యువ ఆటగాళ్లు కూడా పుట్టుకొస్తున్నారు. 

36

అయితే ఈ లీగ్ చరిత్రలో ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ ఎవరు అని  ఆర్సీబీ  స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని అడగగా  అతడు షాకింగ్ సమాధానాలు చెప్పాడు. ధోని, గేల్ వంటి దిగ్గజాలను కాదని ఆర్సీబీ మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ను గోట్ గా అభివర్ణించాడు. 

46

డివిలియర్స్ తో  పాటు ముంబై బౌలర్  లసిత్ మలింగను కూడా ఈ జాబితాలో చేర్చాడు. ఐపీఎల్ లో గోట్ స్టేటస్  పొందేది ఈ ఇద్దరేనని చెప్పాడు. అయితే  ధోని వంటి దిగ్గజాలను సైతం కాదని డివిలియర్స్ పేరు చెప్పడంతో  చెన్నైతో పాటు ఐపీఎల్ అభిమానులు కూడా  కోహ్లీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంత టీమ్ మేట్ అయినంత మాత్రానా గోట్ స్టేటస్ ఇచ్చేయడమేనా..? అని  కామెంట్స్ చేస్తున్నారు. 

56

డివిలియర్స్, మలింగలతో పాటు ఐపీఎల్ లో మరికొన్ని  కేటగిరీలలో  కూడా కొన్ని  పేర్లను  సూచించాడు. అందులో ఐపీఎల్ మోస్ట్ అండర్ రేటెడ్ బ్యాటర్ గా అంబటి రాయడు, గ్రేటెస్ట్ ఆల్ రౌండర్ - షేన్ వాట్సన్ , బెస్ట్ స్పిన్నర్ గా రషీద్ ఖాన్ లను పేర్కొన్నాడు. 

66

 తనకు టీ20లలో ఇష్టమైన  షాట్ ను పుల్ షాట్ అని చెప్పాడు.   అంతేగాక తనకు ఐపీఎల్ లో సీఎస్కేతో ఆడటమంటే చాలా  ఎగ్జయిటింగ్ గా ఉంటుందని వెల్లడించాడు. ఐపీఎల్ -16లో కోహ్లీ ఆడిన ఆరు మ్యాచ్ లలో  కూడా దుమ్ము రేపుతున్నాడు.  నాలుగు హాఫ్  సెంచరీలతో రాణించాడు. 

Read more Photos on
click me!

Recommended Stories