నాకైతే లార్డ్స్‌లో ఆ మూమెంట్ గుర్తొచ్చింది : ఐపీఎల్ లో ఢిల్లీ ఫస్ట్ విక్టరీపై గంగూలీ కామెంట్స్

Published : Apr 21, 2023, 04:04 PM ISTUpdated : Apr 21, 2023, 04:05 PM IST

IPL 2023: ఐపీఎల్ -16లో  ఎట్టకేలకు బోణీ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్.  వరుసగా ఐదు పరాజయాల తర్వాత ఆ జట్టు   గురువారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ ను ఓడించింది. 

PREV
16
నాకైతే లార్డ్స్‌లో ఆ మూమెంట్ గుర్తొచ్చింది : ఐపీఎల్ లో ఢిల్లీ ఫస్ట్ విక్టరీపై గంగూలీ కామెంట్స్

ఐపీఎల్ - 16 లో వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓడిన  ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. ఢిల్లీలో కురిసిన  వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం కలిగినా  వార్నర్ సేనుకు మాత్రం మంచే చేసింది.  కోల్కతా నైట్ రైడర్స్  (కేకేఆర్) తో  గురువారం రాత్రి ముగిసిన మ్యాచ్ లో  తొలుత  ఆ జట్టును  127 పరుగులకే నిలువరించింది. 

26

ఆ తర్వాత ఢిల్లీ  క్యాపిటల్స్  128 పరుగులను సాధించేందుకు  పడుతూ లేస్తూ ఆపసోపాలు పడింది. డేవిడ్ వార్నర్.. మరోసారి హాఫ్ సెంచరీతో అలరించినా లక్ష్య ఛేదనలో 62-2గా ఉన్నా  ఆ జట్టు ఒక్కసారిగా స్పిన్ కుదుపునకు లోనైంది.   

36

కేకేఆర్ స్పిన్నర్ల త్రయం  వరుణ్ చక్రవర్తి, సునీల్  నరైన్, నితీశ్ రాణాకు తోడుగా  అనుకుల్ రాయ్ కూడా రాణించడంతో  ఢిల్లీ బ్యాటర్లు వణికిపోయారు. మిడిల్ ఓవర్స్ తో పాటు   డెత్ ఓవర్లలో కూడా ఢిల్లీ బ్యాటర్లను భయపెట్టారు. అయితే అక్షర్ పటేల్ చివర్లో ఓర్పుగా ఆడి   ఢిల్లీకి విజయాన్ని అందించాడు. 

46

మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీ టీమ్ కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా వ్యవహరిస్తున్న సౌరవ్ గంగూలీ.. ఢిల్లీ క్యాపిటల్స్  విజయం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. దాదా మాట్లాడుతూ.. ‘నేను డగౌట్ లో  చాల టెన్షన్ గా మ్యాచ్ చూస్తున్నా.  మ్యాచ్ గెలవగానే నాకైతే నా టెస్టు కెరీర్ లో ఫస్ట్ రన్ తీసినంత  హ్యాపీగా అనిపించింది.  ఈ మ్యాచ్ లో మేం చాలా బాగా బౌలింగ్ చేశాం..’

56
Image credit: PTI

బెంగళూరుతో ముగిసిన మ్యాచ్ లో  కూడా మేం బాగా బౌలింగ్ చేశాం. కానీ మా బ్యాటింగ్ లో  లోపాలున్నాయి.  గడిచిన ఐదు మ్యాచ్ లతో పాటు నేటి మ్యాచ్ లో కూడా ఇది కనబడింది.   మా జట్టులో పృథ్వీ షా, మిచెల్ మార్ష్,  మనీష్ పాండే చాలా కీలక ఆటగాళ్లు. వాళ్లు వరుసగా విఫలమవుతుండటం మామీద చాలా ప్రభావం చూపుతోంది.  ఈ విషయంలో మేం సమీక్షించుకోవాల్సి ఉంది...’అని చెప్పాడు. కాగా దాదా 1996లో లార్డ్స్ వేదికగా  తొలి టెస్టు ఆడిన విషయం తెలిసిందే.

66

కాగా ఐపీఎల్ - 16లో బోణీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఈనెల 24న హైదరాబాద్ తో  జరుగబోయే మ్యాచ్ లో ఢీకొననుంది. మరి తన పాత టీమ్ పై గతంలో రెండుసార్లు  వీరబాదుడు బాదిన వార్నర్..  ఉప్పల్ లో మరెంత ధాటిగా ఆడతాడో...!

click me!

Recommended Stories