ఐపీఎల్‌లో ఆ టీమ్‌కి ఆడాలనుకున్నా! అంబటి రాయుడి ఆట చూస్తే... విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు...

Published : Apr 20, 2023, 12:23 PM IST

ఐపీఎల్‌లో 16 సీజన్లుగా ఒకే ఒక్క ఫ్రాంఛైజీకి ఆడుతున్న ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. చెన్నై సూపర్ కింగ్స్‌పైన రెండేళ్లు బ్యాన్ పడడంతో ధోనీ ఈ రికార్డును మిస్ అయ్యాడు. ఆర్‌సీబీ ఆటగాడిగానే ఐపీఎల్ నుంచి రిటైర్ అవ్వాలని అనుకుంటున్న విరాట్ కోహ్లీ, కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు...

PREV
17
ఐపీఎల్‌లో ఆ టీమ్‌కి ఆడాలనుకున్నా! అంబటి రాయుడి ఆట చూస్తే... విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు...
Image credit: PTI

‘నేను ఢిల్లీ వాడిని కావడంతో ఐపీఎల్‌లో కూడా ఢిల్లీ టీమ్‌కి ఆడాలని అనుకున్నా. అయితే వాళ్లు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోసం చూడడంతో నన్ను తీసుకోలేదు. అనుకోకుండా ఆర్‌సీబీలోకి వచ్చా. అయితే మొదటి మూడేళ్లు, ఆర్‌సీబీ నాకు ఇచ్చిన సహకారం మరిచిపోలేను...

27
Image credit: PTI

పరుగులు చేయలేక ఫెయిల్ అవుతున్నా సరే, నాకు వరుసగా అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. రిటెన్షన్స్ సమయంలోనూ నిన్ను రిటైన్ చేసుకుంటున్నామని చెప్పారు. ఆరంభంలో నేను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చేవాడిని... 

37

నేను టీమిండియాకి మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తా. ఐపీఎల్‌లో కూడా టాపార్డర్‌లో ఆడాలనుకుంటున్నా అని చెప్పగానే ఆర్‌సీబీ నాకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చింది. ఆ విధంగా అంతర్జాతీయ క్రికెట్‌లో క్రికెటర్‌గా ఎదగడానికి ఆర్‌సీబీ సహకారం కూడా చాలా ఉంది...

47
PTI Photo/Shailendra Bhojak)(PTI04_10_2023_000179B)

2011లో ఢిల్లీ టీమ్, నాతో సంప్రదింపులు జరిపింది. అయితే నేను వెళ్లడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వేరే ఫ్రాంఛైజీకి ఆడి ఉంటే, ఫెయిల్ అయిన ప్లేయర్‌కి ఇన్ని అవకాశాలు దక్కేవి కావు. నాపైన పూర్తి నమ్మకం, భరోసా పెట్టి, సపోర్ట్ చేస్తూ వచ్చారు... అందుకే నేను ఎప్పటికీ ఆర్‌సీబీ ప్లేయర్‌నే...

57

ఐపీఎల్ ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ కుర్రాళ్లు బయటికి వచ్చారు, స్టార్లుగా ఎదిగారు. అందుకే మిగిలిన లీగ్‌లతో పోలిస్తే ఐపీఎల్‌కి ఉన్న బ్రాండ్ వేరు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచులు ఆడేందుకు నేను బాగా ఇష్టపడతా. వాళ్లకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది...
 

67

ఐపీఎల్ చరిత్రలో నా బెస్ట్ మూమెంట్ ఎప్పటికీ 2016 సీజన్. చాలామంది ఆ సీజన్‌లో నేను చేసిన 973 పరుగులకు 373లా చూస్తారు, ఈజీగా కొట్టేయొచ్చని అనుకుంటారు. నా వరకూ అది అసాధ్యం. ఇప్పటికీ నేను అలా ఎలా ఆడగలిగా? అని ఆశ్చర్యపోతూ ఉంటా...

77
PTI Photo/R Senthil Kumar)(PTI04_03_2023_000330B)

ఐపీఎల్‌లో షేన్ వాట్సన్, గ్రేట్ ఆల్‌రౌండర్. అంబటి రాయుడు మోస్ట్ అండర్‌రేటెడ్ ప్లేయర్. అతనికి టాలెంట్‌కి తగ్గ గుర్తింపు రాలేదు. ఐపీఎల్‌లో గ్రేటెస్ట్ ప్లేయర్లు అంటే ఏబీ డివిల్లియర్స్, లసిత్ మలింగ... ’ అంటూ రాబిన్ ఊతప్పకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ..

Read more Photos on
click me!

Recommended Stories