Published : Apr 20, 2023, 11:21 AM ISTUpdated : Apr 20, 2023, 11:49 AM IST
ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతున్న సీనియర్ ప్లేయర్లలో కెఎల్ రాహుల్ ఒకడు. గత మూడు సీజన్లలో ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచిన కెఎల్ రాహుల్, ఈసారి ఇప్పటిదాకా 6 మ్యాచుల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. సీనియర్లు రోహిత్ కోహ్లీ ఉన్నంతసేపు మెరుపులు మెరిపిస్తుంటే రాహుల్ మాత్రం జిడ్డు బ్యాటింగ్‌తో విసిగిస్తున్నాడు...
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసి అవుటైన కెఎల్ రాహుల్, ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్‌లో మెయిడిన్ కూడా ఇచ్చేశాడు. ఐపీఎల్‌లో 2014 నుంచి ఇప్పటిదాకా 27 ఫస్ట్ ఓవర్ మెయిడిన్లు రాగా, అందులో 11 మెయిడిన్లు కెఎల్ రాహుల్ ఇచ్చేయడం విశేషం...
25
PTI Photo) (PTI04_19_2023_000222B)
కెఎల్ రాహుల్‌కి తోడు మరో ఎండ్‌లో దూకుడుగా ఆడే కైల్ మేయర్స్ కూడా కెప్టెన్‌ని ఫాలో అయ్యి నెమ్మదిగా ఆడడంతో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ చూసే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. కెఎల్ రాహుల్ బ్యాటింగ్ అప్రోచ్‌ని తీవ్రంగా విమర్శించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...
35
KL Rahul
‘పవర్ ప్లేలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూడడం పరమ బోరింగ్‌గా ఉంది. ఐపీఎల్‌లో ఇంత బోరింగ్‌గా ఎప్పుడూ అనిపించలేదు...’ అంటూ టీవీ లైవ్‌లో కామెంట్ చేశాడు కేవిన్ పీటర్సన్. ఓ వరల్డ్ క్లాస్ బ్యాటర్‌కి మాజీ కెప్టెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కంటే పెద్ద అవమానం ఏమీ ఉండదు..
45
Image credit: PTI
పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచే లోకేశ్ రాహుల్ ఆట ఈ విధంగా ఉంది. మరీ పిచ్ బీభత్సంగా బ్యాటింగ్‌కి సహకరిస్తే తప్ప, కెఎల్ రాహుల్ రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడడు. సీజన్లు మారుతున్న రాహుల్ బ్యాటింగ్ విధానంలో మాత్రం మార్పు రావడం లేదు...
55
KL Rahul
ఐపీఎల్ 2020 సీజన్‌లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన కెఎల్ రాహుల్, 2021 సీజన్‌లో 626, 2022లో 616 పరుగులు చేశాడు. 2023 సీజన్‌లో 6 మ్యాచులు ఆడి 194 పరుగులు చేసిన కెఎల్ రాహుల్.. 114.79 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు.