లక్నో సూపర్ జెయింట్స్‌కి దెబ్బ మీద దెబ్బ... ప్రాక్టీస్ చేస్తూ జయ్‌దేవ్, ఫీల్డింగ్ చేస్తూ కెఎల్ రాహుల్...

Published : May 01, 2023, 08:14 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో టాప్ 2లో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్‌‌కి దెబ్బ మీద దెబ్బ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఏకంగా ఇద్దరు లక్నో ప్లేయర్లు తీవ్రంగా గాయపడడం ఆ జట్టుని తీవ్రంగా కలవరబెడుతోంది..

PREV
16
లక్నో సూపర్ జెయింట్స్‌కి దెబ్బ మీద దెబ్బ... ప్రాక్టీస్ చేస్తూ జయ్‌దేవ్, ఫీల్డింగ్ చేస్తూ కెఎల్ రాహుల్...

ఆర్‌సీబీతో మ్యాచ్ ఆరంభానికి ముందు నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్, అదుపు తప్పి పడిపోయాడు. అతని చేతి బెణకడంతో ఫిజియోతో కలిసి డగౌట్‌కి చేరుకున్నాడు జయ్‌దేవ్ ఉనద్కట్...
 

26
Image credit: Getty

జయ్‌దేవ్ ఉనద్కట్ గాయానికి స్కానింగ్ చేసిన తర్వాత కానీ అతని ఫిట్‌నెస్ గురించి అప్‌డేట్ రాదు. 3 మ్యాచుల్లో వికెట్లు తీయలేకపోయిన జయ్‌దేవ్ ఉనద్కట్, ఐపీఎల్ తర్వాత జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి సెలక్ట్ అయ్యాడు..
 

36

మార్కస్ స్టోయినిస్ వేసిన రెండో ఓవర్‌లో ఆఖరి బంతికి ఫాఫ్ డుప్లిసిస్ కొట్టిన ఫోర్‌ని ఆపేందుకు ప్రయత్నించిన కెఎల్ రాహుల్, తొడ కండరాలు పట్టుకోవడంతో కిందపడిపోయాడు.  లేచి నడవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు కెఎల్ రాహుల్...
 

46
KL Rahul

కెఎల్ రాహుల్ ఆడకపోతే లక్నో సూపర్ జెయింట్స్‌కి వచ్చిన ప్రమాదమేమీ లేదు. రాహుల్ టెస్టు బ్యాటింగ్‌తో ప్రేక్షకులను విసిగిస్తూ, ప్రత్యర్థి టీమ్‌కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అతని గాయం లక్నోని దెబ్బ తీయకపోయా, మరో హిట్టర్‌ని ఆడించేందుకు ఉపయోగపడొచ్చు...
 

56

అది పక్కనబెడితే కెఎల్ రాహుల్ కూడా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌లో కూర్చున్నాడు..

66

ప్రాక్టీస్ లేని శ్రీకర్ భరత్ కంటే టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న కెఎల్ రాహుల్‌ని వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా ఫైనల్‌లో మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని భావించింది టీమిండియా. అతని గాయం, ఆ ప్లాన్స్‌ని మార్చేయొచ్చు.. 
 

click me!

Recommended Stories