రాసిపెట్టుకోండి! 6 నెలల్లో అతను టీమిండియాకి ఆడతాడు... తిలక్ వర్మపై మాజీ హెడ్ కోచ్ కామెంట్..

Published : Apr 14, 2023, 04:02 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్, మొదటి మూడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకుంది. అయితే ముంబై తరుపున తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఆర్‌సీబీతో వన్ ఆఫ్ ది సీజన్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన తిలక్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లోనూ రాణించాడు..

PREV
16
రాసిపెట్టుకోండి! 6 నెలల్లో అతను టీమిండియాకి ఆడతాడు... తిలక్ వర్మపై మాజీ హెడ్ కోచ్ కామెంట్..
Tilak Varma

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినా తిలక్ వర్మ 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి... అద్భుత ఇన్నింగ్స్‌తో టీమ్‌ని ఆదుకున్నాడు. అయితే బౌలర్ల వైఫల్యంతో ముంబైకి పరాజయం తప్పలేదు...

26

చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 18 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి అవుటైన తిలక్ వర్మ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసి అదరగొట్టాడు. 3 మ్యాచుల్లో 147 పరుగులు చేసిన తిలక్ వర్మ, ముంబై ఇండియన్స్ తరుపున టాప్ స్కోరర్‌గా ఉన్నాడు..

36

‘నా వరకూ తిలక్ వర్మ ఇప్పటికే భారత క్రికెటర్ అయిపోయాడు. త్వరలో అతను టీమిండియాకి ఆడతాను. వచ్చే ఆరేడు నెలల్లో తిలక్ వర్మకు టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రాకపోతే అది నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే అతని ఆటలో ఎంతో మెచ్యూరిటీ ఉంది..

46

మిడిల్ ఆర్డర్‌లో టీమిండియాకి సరైన ప్లేయర్ కావాలి. ఆ ప్లేయర్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు తిలక్ వర్మలో ఉన్నాయి. అతనికి ఇప్పటికి 20 ఏళ్లే కానీ అతని ఆటలో ఉన్న పరిణితి చూస్తే 30+ ప్లేయర్‌లా అనిపిస్తాడు. చాలా పాజిటివ్‌ మైండ్‌ సెట్‌తో ఆడుతున్నాడు...
 

56
(PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000366B)

ముంబై ఇండియన్స్‌కి అలాగే టీమిండియాకి కూడా అతను ఫ్యూచర్ స్టార్‌లా కనిపిస్తున్నాడు. కెరీర్‌ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తిలక్ వర్మ.. గొప్ప క్రికెటర్లలో ఒకడిగా నిలుస్తాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు.. ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి.. 

66

ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్‌ని ఏప్రిల్ 16న ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఆడనుంది. 

click me!

Recommended Stories