స్పెషల్ మ్యాచ్‌లో స్పెషల్ రికార్డు కోసం..! కేకేఆర్‌తో పోరులో భువీ సాధిస్తాడా..?

Published : Apr 14, 2023, 03:06 PM IST

IPL 2023: టీమిండియా వెటరన్  పేసర్ భువనేశ్వర్ కుమార్  ఐపీఎల్ లో  నేడు 150వ మ్యాచ్ ఆడుతున్నాడు.  అలాగే  ఈ మ్యాచ్ లో  అతడు  ఓ స్పెషల్ రికార్డు కూడా  సాధించడానికి రెడీ అవుతున్నాడు. 

PREV
16
స్పెషల్ మ్యాచ్‌లో స్పెషల్ రికార్డు కోసం..!  కేకేఆర్‌తో పోరులో భువీ సాధిస్తాడా..?

ఐపీఎల్ - 2023లో  రెండు మ్యాచ్ లలో ఓడి ఆ తర్వాత స్వంత గ్రౌండ్ లో   పంజాబ్ కింగ్స్ ను ఓడించిన సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు  ఈడెన్ గార్డెన్ వేదికగా  కోల్‌కతా నైట్ రైడర్స్  తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్  ఆ జట్టు వెటరన్ పేసర్  భువనేశ్వర్ కుమార్ కు చాలా ప్రత్యేకం. 

26

కేకేఆర్ తో ఆడబోయే మ్యాచ్ భువీకి 150వది.  సన్ రైజర్స్ కు దాదాపు  పదేండ్ల నుంచి ఆడుతున్న  భువీ..  2016లో  ఎస్ఆర్‌హెచ్ ట్రోఫీ నెగ్గడంతో పాటు కీలక విజయాల్లో భాగస్వామిగా ఉన్నాడు.  పవర్ ప్లే లో వికెట్లు తీయడంతో పాటు డెత్ ఓవర్లలో   పరుగులు కట్టడిచేయడంలో సిద్ధహస్తుడైన భువీ.. ఈ మ్యాచ్  ద్వారా మరో ఘనత అందుకోబోతున్నాడు. 

36

కోల్కతా పై  భువీకి మంచి రికార్డు ఉంది.   ఐపీఎల్ లో కేకేఆర్ పై అతడు  30 వికెట్లు సాధించాడు. కేకేఆర్ పై మరే బౌలర్  కూడా ఇన్ని వికెట్లు తీయలేదు.  నేటి మ్యాచ్ లో భువీ గనక ఒక వికెట్ తీస్తే  ఒక ఫ్రాంచైజీపై అత్యధిక వికెట్లు తీసిన  ఐదో బౌలర్ గా నిలుస్తాడు.   

46

ఐపీఎల్ లో  ఒక జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన ఘనత  ఉమేశ్ యాదవ్ కు ఉంది.  ఉమేశ్.. పంజాబ్ కింగ్స్ పై 34 వికెట్లు తీశాడు.   ఆ జాబితాలో డ్వేన్ బ్రావో (ముంబై పై 33), సునీల్ నరైన్ (33, పంజాబ్ పై), లసిత్ మలింగ (31, చెన్నైపై)  అమిత్ మిశ్రా  (30, రాజస్తాన్ పై )  భువీ కంటే ముందున్నారు. 

56

నేటి మ్యాచ్ లో భువీ గనక రెండు వికెట్లు తీస్తే  మిశ్రా, మలింగ  రికార్డులను దాటేస్తాడు.   3 తీస్తే నరైన్, బ్రావోలతో సమంగా నిలుస్తాడు.  మరి ఈడెన్ గార్డెన్ లో భువీ ఏం చేస్తాడో తెలియాలంటే నేటి రాత్రి వరకూ ఆగాల్సిందే. 

66

మొత్తంగా భువీ  తన ఐపీఎల్ కెరీర్ లో  ఇప్పటివరకు (2011 నుంచి) 149 మ్యాచ్ లు ఆడి  156 వికెట్లు తీశాడు.  అత్యుత్తమ ప్రదర్శన  5-19గా ఉంది. ఐపీఎల్ లో భువీ.. నాలుగు వికెట్ల ప్రదర్శన రెండు సార్లు చేయగా  ఒకసారి ఐదు వికెట్లు తీశాడు. ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన   బౌలర్ల జాబితాలో  భువీ.. 8వ స్థానంలో ఉన్నాడు. 

click me!

Recommended Stories