మా గురించి తెలుసుగా..! బోగీలో బెర్త్ ఖాళీ ఉంది.. మిమ్మల్నీ తీసుకుపోతాం బ్రో.. ఆర్సీబీకి హైదరాబాద్ భయం..

Published : May 18, 2023, 04:41 PM ISTUpdated : May 18, 2023, 04:48 PM IST

IPL 2023: ఐపీఎల-16 ప్లేఆఫ్స్   రేసులో ఉన్న  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు  సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్ వేదికగా కీలక మ్యాచ్ ఆడనుంది.  ఈ మ్యాచ్ లో ఫలితం తేడా కొడితే  బెంగళూరుకు షాక్ తప్పదు.  

PREV
16
మా గురించి తెలుసుగా..! బోగీలో బెర్త్ ఖాళీ ఉంది..  మిమ్మల్నీ తీసుకుపోతాం బ్రో.. ఆర్సీబీకి హైదరాబాద్ భయం..

ఐపీఎల్ లో కొన్ని జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుంది.  ముంబై  - చెన్నై మధ్య  పోరును  ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తుండగా   రాజస్తాన్ - పంజాబ్,  ఆర్సీబీ - సీఎస్కే మధ్య పోటీలు కూడా రసవత్తరంగా ఉంటాయి. ఈ జాబితాలో  మోస్ట్ అండర్ రేటెడ్ ఫైట్ ఏదైనా ఉందా..? అంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే పోటీనే.

26

ఆర్సీబీ ఐపీఎల్ లో  మూడు సార్లు ఫైనల్స్ చేరింది.  ఈ మూడింటిలో  రెండు సార్లు ఆ జట్టును  ఓడించింది హైదరాబాదే.  2009 లో  అప్పటి డెక్కన్ ఛార్జర్స్  టీమ్ ఆర్సీబీని  ఓడించి తొలి కప్ ముద్దాడింది.  ఆ తర్వాత  2016 లో   కూడా ఆర్సీబీ ఫైనల్ చేరింది.  

36

ఈసారి ఆర్సీబీకి షాకిచ్చింది కూడా హైదరాబాదే. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్..  ఆర్సీబీని ఓడించి  సన్ రైజర్స్ కు ఫస్ట్ ట్రోఫీని అందించింది. ఆర్సీబీ ఆశలను నట్టేట ముంచింది.  ఈ రెండు సందర్భాల్లోనే కాదు.  ఐపీఎల్ లో  చాలాసార్లు ఆర్సీబీకి ఎస్ఆర్‌‌హెచ్ ఊహించని ధమ్కీలు ఇచ్చింది.  

46

2012లో ఆర్సీబీ లాస్ట్ లీగ్ మ్యాచ్ డెక్కన్ ఛార్జర్స్ తోనే జరిగింది. ఈ మ్యాచ్ లో ఓడటంతో నాలుగో స్థానాన్ని కోల్పోయింది.   నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో  సీఎస్కే ఫోర్త్ ప్లేస్‌కు ఎగబాకింది. 2013లో కూడా  సేమ్ ఇదే సీన్ రిపీట్ అయింది. కానీ నాలుగో  ప్లేస్ లో ప్లేఆఫ్స్ కు వెళ్లింది మాత్రం హైదరాబాద్. 

56

2015లో ఎస్ఆర్హెచ్ తమ చివరి లీగ్ మ్యాచ్ లో ముంబై చేతిలో ఓడటంతో  ఆర్సీబీకి షాకులు తప్పలేదు. ఈ సీజన్ లో  ప్లేఆఫ్స్ కు  వెళ్లిన ఆర్సీబీ.. మూడో స్థానానికి పరిమితమైంది.  2016లో ఆర్సీబీ  ఫైనల్ లో హైదరాబాద్ చేతిలో ఓడింది. 2020లో కూడా హైదరాబాద్..  ఎలిమినేటర్  దశలో ఆర్సీబీని ఓడించింది. తాజాగా నేడు  తమతో జరుగబోయే  మ్యాచ్ లో హైదరాబాద్ ఎలాంటి షాకులిస్తుందోనని బెంగళూరు అభిమానులు   ఆందోళన చెందుతున్నారు.  

66

నేటి మ్యాచ్ లో హైదరాబాద్.. బెంగళూరుకు షాకిస్తే మాత్రం ముంబైకి  ప్లేఆఫ్స్  బెర్త్ ఖాయం అయినట్టే. ఇదే క్రమంలో  ఆర్సీబీకి  ఇదివరకే అస్సాం ట్రైన్ లో బెర్త్ లు ఖాయం చేసుకున్న  ఢిల్లీ,  హైదరాబాద్, పంజాబ్ లతో  పాటు  చోటు దొరుకుతుంది. మరీ లేట్ అయితే ఇక  స్లీపర్ బోగీలు దొరక్క జనరల్ కంపార్ట్‌మెంటే గతి అంటూ కామెంట్స్ చేస్తున్నారు  ఐపీఎల్ ఫ్యాన్స్.. 

click me!

Recommended Stories