రికీ పాంటింగ్ వేస్ట్, సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్‌గా చేస్తే టైటిల్ గెలిపిస్తాడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...

Published : May 18, 2023, 11:03 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడినా ఆ తర్వాత వరుస విజయాలతో కమ్‌బ్యాక్ ఇచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయిన ఢిల్లీ, అదే టీమ్‌ని ఓడించి ప్రతీకారం తీర్చుకుంది...

PREV
17
రికీ పాంటింగ్ వేస్ట్, సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్‌గా చేస్తే టైటిల్ గెలిపిస్తాడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...
PTI Photo/Ravi Choudhary) (PTI05_06_2023_000496B)

13 మ్యాచుల్లో 8 పరాజయాలు, 5 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే ఆఖరి పొజిషన్‌లో ఉండకుండా తప్పించుకోవచ్చు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం ఆ టీమ్‌ని తీవ్రంగా దెబ్బ తీసింది...

27
Image credit: PTI

ఐపీఎల్ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి మెంటర్‌గా వ్యవహరించిన గంగూలీ, ఆ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అందుకోవడంతో టీమ్ నుంచి దూరమయ్యాడు. 2023 సీజన్‌కి ముందు తిరిగి ఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు తీసుకున్నాడు గంగూలీ...

37

‘సౌరవ్ గంగూలీ, ఢిల్లీ డగౌట్‌లో ఉండడం చాలా పెద్ద విషయం. నాకు తెలిసి దాదాకి ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ పదవి ఇస్తే, అది టీమ్‌లో చాలా మార్పులు తీసుకురావచ్చు. టీమ్ ఐపీఎల్ టైటిల్ గెలిచినా గెలవచ్చు...
 

47

భారత ప్లేయర్ల సైకాలజీ అర్థం చేసుకోవడం చాలా కష్టం. రికీ పాంటింగ్ ఈ విషయంలోనే ఫెయిల్ అవుతున్నట్టు తెలుస్తోంది. సౌరవ్ గంగూలీ, మన కుర్రాళ్ల గురించి బాగా తెలుసు. వాళ్లకి ఎలా చెబితే వింటారో, డ్రెస్సింగ్ రూమ్‌ని ఎలా ఉంచాలో గంగూలీ దగ్గర నేర్చుకోవచ్చు...

57
Image credit: Delhi Capitals

ఢిల్లీ క్యాపిటల్స్, దాదా నాలెడ్జ్‌ని సరిగ్గా వాడుకోవాలి. వచ్చే సీజన్‌కి ముందుగానే సిద్ధం అవుతుంటే సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్‌ నియమించడమే సరైన నిర్ణయం అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...
 

67

రికీ పాంటింగ్ హెడ్ కోచింగ్‌లో, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో మొట్టమొదటిసారి 2020లో ఫైనల్ చేరింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే ముంబై చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2021 సీజన్ ఆరంభానికి ముందు అయ్యర్ గాయపడడంతో అతని ప్లేస్‌లో రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ పగ్గాలు అందించాడు రికీ పాంటింగ్...

77
Shreyas Iyer-Rishabh Pant

శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుననా రిషబ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాడు. 2021 సీజన్‌లో రెండో క్వాలిఫైయర్‌లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్,  2022 సీజన్‌లో నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో ఐదో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌‌కి అర్హత సాధించలేకపోయింది.

click me!

Recommended Stories