ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ కుర్రాడి హవా... విరాట్ కోహ్లీ, క్వింటన్ డి కాక్‌లను వెనక్కినెట్టి...

Published : May 18, 2023, 10:38 AM IST

క్రికెట్ పసికూన ఐర్లాండ్‌కి చెందిన ఓ యంగ్ క్రికెటర్, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపుతున్నాడు. అది కూడా అలా ఇలా కాదు, విరాట్ కోహ్లీ, క్వింటన్ డి కాక్‌లాంటి స్టార్లనే వెనక్కి నెట్టేశాడు...

PREV
15
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ కుర్రాడి హవా... విరాట్ కోహ్లీ, క్వింటన్ డి కాక్‌లను వెనక్కినెట్టి...

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టర్ 140 పరుగులు చేసి, కెరీర్ బెస్ట్ స్కోరు అందుకున్నాడు...
 

25
Harry Tector

3 మ్యాచుల్లో కలిపి 206 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన హ్యారీ టెక్టర్, ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 7కి ఎగబాకాడు...

35
Image credit: PTI

హ్యారీ టెక్టర్ దెబ్బకు కొన్నాళ్లుగా ఏడో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ 8వ స్థానానికి పడిపోగా, 8వ స్థానంలో ఉన్న సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటర్ డి కాక్ 9వ ర్యాంకుకి పడిపోయాడు...

45
Image credit: PTI

పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతుంటే, శుబ్‌మన్ గిల్ టాప్ 5లో ఉన్నాడు. ప్రస్తుతం 722 పాయింట్లు సాధించిన హ్యారీ టెక్టర్, వన్డేల్లో బెస్ట్ ర్యాంకు సాధించిన ఐర్లాండ్ క్రికెటర్‌గా నిలిచాడు...

55

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, 2019లో అత్యధికంగా 712 పాయింట్లు సాధించాడు. ఇయాన్ మోర్గాన్, ఐర్లాండ్ క్రికెటరే‌ అయినా ఇంగ్లాండ్‌కి ఆడుతున్నప్పుడే బెస్ట్ ర్యాంకు సాధించాడు. 2021 జూన్‌లో పాల్ స్టిర్లింగ్ 697 పాయింట్లు సాధించాడు. ఈ ఇద్దరి రికార్డును అధిగమించాడు హ్యారీ టెక్టర్..

Read more Photos on
click me!

Recommended Stories