చెన్నైతో మ్యాచ్ విషయానికొస్తే రాజస్తాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (52), పడిక్కల్ (38), అశ్విన్ (30) రాణించారు. అనంతరం చెన్నై..20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవాన్ కాన్వే (50) రాణించినా చివర్లో ధోని (32నాటౌట్), రవీంద్ర జడేజా (25 నాటౌట్) లు మెరుపులు మెరిపించినా చెన్నైకి ఓటమి తప్పలేదు.