PTI PhotoR Senthil Kumar)(PTI05_23_2023_000356B)
గాయం కారణంగా 2022 సీజన్‌కి దూరంగా ఉన్న దీపక్ చాహార్, 2023 సీజన్‌లో టీమ్‌కి అందుబాటులోకి వచ్చాడు. సీజన్ మొదట్లో పూర్తి ఫిట్‌నెస్ లేక వికెట్లు తీయడానికి ఇబ్బంది పడిన దీపక్ చాహార్, 9 మ్యాచుల్లో 12 వికెట్లు తీసి కమ్‌బ్యాక్ ఇచ్చాడు...
‘చెన్నై సూపర్ కింగ్స్‌లో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ మాట్లాడే స్వాతంత్ర్యం ఉంటుంది. ఎవ్వరైనా ఎవ్వరికైనా ఏమైనా చెప్పొచ్చు. ఎవ్వరూ కూడా ప్లేయర్లకు ఆర్డర్స్ ఇవ్వరు...
PTI PhotoR Senthil Kumar)(PTI05_23_2023_000393B)
నువ్వు ప్రాక్టీస్ చేయాలి, జిమ్‌కి వెళ్లాలి? అని కచ్చితంగా చెప్పరు. నువ్వు ఓ ప్రొఫెషనల్ క్రికెటర్‌వి. నీ నుంచి బెస్ట్ రాబట్టే బాధ్యత నీపైనే ఉందనే స్వేచ్ఛ ఇస్తారు. నీ ప్రాక్టీస్ నీ ఇష్టం. ఈ రోజు చేస్తావా? లేక రేపు చేస్తావా? అని ఎవ్వరూ అడగరు...
Deepak Chahar
ప్రాక్టీస్ చేయకుండా రెస్ట్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. ప్రాక్టీస్‌లో నువ్వు ఎలా ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు కానీ గ్రౌండ్‌లో బాగా ఆడాల్సిన బాధ్యత కూడా నీపైనే ఉంటుంది. టీమ్‌లో ప్రతీ ఒక్కరికీ ఈ విషయం గురించి తెలుసు...
PTI PhotoR Senthil Kumar)(PTI05_06_2023_000174B)
మ్యాచ్ ఓడిపోయినా సరే ఎవ్వరూ ఎవ్వరినీ ఒక్క మాట కూడా అనరు. మాహీ భాయ్ కూడా ఏమీ మాట్లడరు. అందుకే ఏ ప్లేయర్ పైన కూడా ఒత్తిడి ఉండదు. టీమ్ సక్సెస్‌కి మాహీ భాయ్ కూడా ఓ కారణం. నేను సీఎస్‌కేలో చేరినప్పుడు టీమ్ డిన్నర్ సమయంలో ఓ విషయాన్ని గమనించా...
PTI PhotoShailendra Bhojak)(PTI04_17_2023_000216B)
ప్లేయర్లు అందరూ రెండు మూడు టేబుళ్లపైనే కూర్చున్నారు. ఒకటి సీనియర్లు, మరోటి ఓవర్‌సీస్ ప్లేయర్లు తీసుకుంటే ఇంకోటి జూనియర్ ప్లేయర్లు... కొత్త ప్లేయర్లు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మాహీ భాయ్ మాత్రం జూనియర్లతోనే కూర్చొని తింటారు. అది ఫిక్స్..
ఏ కెప్టెన్ కూడా జూనియర్లతో కలిసి డిన్నర్ చేయడం నేను చూడలేదు. కొత్త ప్లేయర్లలో ఉండే భయాన్ని పోగొట్టేందుకు, వారితో కలిసి పోవడానికి మాహీ భాయ్ ఈ పని చేస్తాడు. అందుకే మాహీ భాయ్ కోసం ఏం చేయడానికైనా ప్లేయర్లు సిద్ధంగా ఉంటారు...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే బౌలర్ దీపక్ చాహార్..