ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్ ఫస్టాఫ్... ట్విస్టులు, థ్రిల్లర్స్ మధ్యలో ప్లేఆఫ్స్ రేసులో ఆ నాలుగు టీమ్స్...

Published : Apr 26, 2023, 04:36 PM IST

ఐపీఎల్ 2023 సీజన్ ఫస్టాఫ్ ముగిసింది. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సగం లీగ్ మ్యాచులు ముగిశాయి. ఫస్టాఫ్‌లో ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులు, ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ అందించాయి...  

PREV
19
ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్ ఫస్టాఫ్... ట్విస్టులు, థ్రిల్లర్స్ మధ్యలో ప్లేఆఫ్స్ రేసులో ఆ నాలుగు టీమ్స్...

ఐపీఎల్ 2023 సీజన్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 7 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, టేబుల్ టాప్ పొజిషన్‌లో నిలిచింది. మిగిలిన 7 మ్యాచుల్లో మరో 3 విజయాలు అందుకుంటే చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది...
 

29
PTI Photo) (PTI04_25_2023_000381B)

డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కూడా 7 మ్యాచుల్లో 5 విజయాలు అందుకుంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ సిక్సర్ల సునామీ కారణంగా టైటాన్స్ ఓటమి చవిచూసింది కానీ లేకపోతే టైటాన్స్ కథ వేరేగా ఉండేది. గుజరాత్ టైటాన్స్ మిగిలిన 7 మ్యాచుల్లో 3 విజయాలు అందుకుంటే ప్లేఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమే...

39
Image credit: PTI

గత సీజన్‌లో ఫైనల్ చేరి, రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ కూడా 7 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని మెరుగైన రన్‌ రేట్‌తో టాప్ 3లో ఉంది. మిగిలిన 7 మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ కనీసం 4 విజయాలు అందుకుంటే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. స్టార్ ప్లేయర్లు పుష్కలంగా ఉన్న రాయల్స్, కాస్త నిలకడైన ప్రదర్శన కనబరిస్తే ప్లేఆఫ్స్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు...

49
PTI Photo) (PTI04_19_2023_000278B)

లక్నో సూపర్ జెయింట్స్ 7 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని టాప్ 4లో ఉంది. అయితే టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో చిత్తుగా ఓడిన సూపర్ జెయింట్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే 100 శాతం ఎఫర్ట్స్ పెట్టాల్సిందే... గత సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన లక్నో, నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది..

59

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుంది. ఆర్‌సీబీ ఏ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందో చెప్పడం కష్టం. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో బ్యాటింగ్‌లో కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, మ్యాక్స్‌‌వెల్, బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ తప్ప మరో ఆర్‌సీబీ ప్లేయర్ ఆడింది లేదు. లక్కీగా ప్లేఆఫ్స్ చేరినా, ఆర్‌సీబీ ఇదే పర్పామెన్స్ కొనసాగిస్తే టైటిల్ కలలు ఈ సారి కూడా నెరవేరడం కష్టమే...

69
Image credit: PTI

7 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న పంజాబ్ కింగ్స్, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. గత 4 సీజన్లుగా ఆరో స్థానంలోనే ముగిస్తున్న పంజాబ్ కింగ్స్, ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శనే ఇస్తోంది. అయితే పంజాబ్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.
 

79

ముంబై ఇండియన్స్ 7 మ్యాచుల్లో 3 విజయాలు అందుకోగా కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్టాఫ్‌లో 5 మ్యాచుల్లో ఓడి రెండేసి విజయాలు మాత్రమే అందుకున్నాయి. ముంబై ఇండియన్స్ ఫస్టాఫ్‌లో ఇచ్చిన పర్ఫామెన్స్‌ని గమనిస్తే, ఆ టీమ్‌ ప్లేఆఫ్స్ చేరడం కష్టమే...
 

89
Image credit: PTI

పాయింట్ల పట్టికలో కింద ఉన్నా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తే, పైకి ఎగబాకగలదు. 2021 సీజన్‌ ఫస్టాఫ్‌లో కూడా దాదాపు ఇదే పొజిషన్‌లో ఉన్న కేకేఆర్, అన్యూహ్యాంగా ఫ్లేఆఫ్స్‌కి వెళ్లి ఫైనల్ ఆడింది. ఈసారి అలాంటి ఫీట్ రిపీట్ చేయాలంటే కేకేఆర్ ప్లేయర్లు అదరగొట్టాలి...
 

99
SRH vs DC


సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆఖరి పొజిషన్ కోసం పోటీ జరుగుతోంది. ఫస్టాఫ్‌లో ఈ రెండు టీమ్స్ ఆడిన విధానం చూసిన తర్వాత ఇవి ప్లేఆఫ్స్ చేరాలంటే 8వ వింత ఏదో జరగాలి. మిగిలిన 7 మ్యాచుల్లో కనీసం 6 విజయాలు అందుకుంటే కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ రేసులో ఉండవు..  

click me!

Recommended Stories