నేనిక్కడకు వచ్చింది ఐపీఎల్ ఆడటానికి.. చిల్లర గొడవలకు కాదు : నవీన్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు

Published : May 03, 2023, 01:42 PM IST

IPL 2023: లక్నో - ఆర్సీబీ  మ్యాచ్ లో భాగంగా   కోహ్లీ.. నవీన్ ను స్లెడ్జ్ చేయడం , తర్వాత తన బూటు కాలును చూపిస్తూ  ఏదో అనడం.. షేక్ హ్యాండ్ ఇచ్చేప్పుడు   మాటా మాటా అనుకోవడం   తీవ్ర వివాదాస్పదమైంది. 

PREV
16
నేనిక్కడకు వచ్చింది ఐపీఎల్ ఆడటానికి.. చిల్లర గొడవలకు కాదు :  నవీన్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు

రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో గొడవపడి  అతడి ఫ్యాన్స్  ఆగ్రహానికి గురైన  ఆఫ్గానిస్తాన్   బౌలర్ నవీన్ ఉల్ హక్.  లక్నో - ఆర్సీబీ  మ్యాచ్ లో భాగంగా   కోహ్లీ.. నవీన్ ను స్లెడ్జ్ చేయడం , తర్వాత తన బూటు కాలును చూపిస్తూ  ఏదో అనడం.. షేక్ హ్యాండ్ ఇచ్చేప్పుడు   మాటా మాటా అనుకోవడం   తీవ్ర వివాదాస్పదమైంది. 

26

దీంతో  కోహ్లీ ఫ్యాన్స్  అంతా  నవీన్ ను టార్గెట్ చేసి   అతడి సోషల్ మీడియా ఖాతాలలో దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా  ఈ వివాదంపై నవీన్ ఘాటుగా స్పందించాడు.   తాను ఇక్కడికి వచ్చింది ఐపీఎల్ ఆడేందుకని, చిల్లర గొడవలకు కాదని  వ్యాఖ్యానించాడు.  

36

ఇదే వివాదంపై నవీన్ ఉల్ హక్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడికి వచ్చింది ఐపీఎల్ ఆడటానికి.. ఎవరితో గొడవపడటానికో   మరెవరినో నిందించడానికి  కాదు..’ అని  అన్నాడు. 

46

కాగా మొన్నటి మ్యాచ్ ముగిసిన తర్వాత  నవీన్ తన  ఇన్‌స్టా స్టోరీస్ లో కూడా  ఆసక్తికర పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీతో గొడవ తర్వాత చాలామంది భారతీయుల దృష్టిలో విలన్‌గా మారిపోయిన నవీన్ వుల్ హక్..  ‘నువ్వు దేనికి అర్హుడివో నీకు అదే దక్కుతుంది. ఏదైనా అలాగే జరుగుతుంది. అలాగే సాగుతుంది...’ అంటూ  స్టోరీస్ లో రాసుకొచ్చాడు. 

56

ఈ గొడవ తర్వాత కోహ్లీ కూడా తన ఇన్‌స్టా స్టోరీస్  లో  ‘మనం వినేవన్నీ కేవలం అభిప్రాయాలు మాత్రమే, వాస్తవాలు కావు. అలాగే మనం చూసేవన్నీ జరిగినదానికి ఓ వైపు మాత్రమే నిజాలు కావు..’ అంటూ కొటేషన్‌గా స్టేటస్‌గా పెట్టాడు. 

66

ఆఫ్ఘాన్ కు చెందిన ఈ పేసర్.. ఇప్పటిదాకా అంతర్జాతీయ స్థాయిలో  7 వన్డేలు, 21 టీ20 మ్యాచులు ఆడి 42 వికెట్లు తీశాడు. నవీన్ వుల్ హక్‌ని బ్రేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. 2020 పాక్ సూపర్ లీగ్‌లో పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీతో గొడవ పడి వెలుగులోకి వచ్చాడు 

click me!

Recommended Stories