ఫైనల్ ఫిక్స్ అయ్యిందా... మ్యాచ్ మొదలు కాకముందే రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ అంటూ చూపించడంతో...

Published : May 28, 2023, 07:11 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ ఆరంభం నుంచి స్క్రిప్టు అనే ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతూ వచ్చింది. ఎందుకంటే ప్రతీ మ్యాచ్ ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగడం, ట్విస్టులు, ఊహించని మలుపులతో 2023 సీజన్‌... బంపర్ క్రేజ్ కొట్టేసింది..  

PREV
16
ఫైనల్ ఫిక్స్ అయ్యిందా... మ్యాచ్ మొదలు కాకముందే రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ అంటూ చూపించడంతో...

నాటకీయ పరిణామాల మధ్య చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుకున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగిన ఓ టెక్నికల్ తప్పిదం, ఫైనల్ ఫిక్స్ అయ్యిందా? అనే అనుమానాలు రేగడానికి కారణమైంది..
 

26

ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు అహ్మదాబాద్‌లో వర్షం కురిసింది. దీంతో టాస్ ఆలస్యమైంది. టాస్ ఆలస్యమైన విషయాన్ని ప్రదర్శించాల్సిన స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్ మీద రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ అని పడింది...
 

36
CSK vs GT Final

మ్యాచ్ ఇంకా మొదలు కాకముందే రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ అని పడడం అంటే ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ గెలవబోతుందని ముందుగానే రాసి పెట్టారా? అని అనుమానిస్తున్నారు ఫ్యాన్స్...

46
Image credit: PTI

జరిగింది టెక్నికల్ తప్పిదమే అయినా చెన్నై సూపర్ కింగ్స్‌ రన్నరప్ అవుతుందని ఎలా ఊహించారు? అయినా మ్యాచ్ ప్రారంభానికి ముందే సీఎస్‌కే ఓడిపోతుందని ఎలా అంచనా వేసి ప్రెసెంటేషన్ రెఢీ చేసి పెట్టుకున్నారు? అనే అనుమానాలు రేగుతున్నాయి..
 

56

అసలు ఆరంభం నుంచి ప్రతీ మ్యాచ్ స్క్రిప్టు ప్రకారం నడుస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ 2023 సీజన్‌కి ఇలా ఫైనల్‌లో అనుకోని తప్పిదం, ఫిక్సింగ్ ఆరోపణలకు మరింత ఊతం కలిగించింది...

66

ఒకవేళ మ్యాచ్ ప్రారంభమై సజావుగా జరిగి గుజరాత్ టైటాన్స్ గెలిస్తే ఈ ఫిక్సింగ్ ఆరోపణలు మరింత పెరుగుతాయి. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ బాగా ఆడి గెలిచినా..  సీఎస్‌కే ఓడిపోవాలని ముందుగానే ఐపీఎల్ మేనేజ్‌మెంట్ ఫిక్స్ చేసిందనే వాదనలు పెరుగుతాయి. 

click me!

Recommended Stories