రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు... ఫైనల్‌లోనే ఆఖరి ఆట ఆడబోతున్న తెలుగు క్రికెటర్...

Published : May 28, 2023, 06:20 PM ISTUpdated : May 28, 2023, 06:31 PM IST

భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఇదే తనకి ఐపీఎల్‌లో ఆఖరి ఆట కాబోతుందంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు...  

PREV
16
రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు... ఫైనల్‌లోనే ఆఖరి ఆట ఆడబోతున్న తెలుగు క్రికెటర్...
Ambati Rayudu

ఐపీఎల్‌ 2010 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ద్వారా ఆరంగ్రేటం చేసిన అంబటి రాయుడు, 2018 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున మూడు టైటిల్స్ గెలిచిన అంబటి రాయుడు, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 2018, 2021 సీజన్లలో టైటిల్స్ గెలిచాడు..

26

2018 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన మొదటి సీజన్‌లో 602 పరుగులు చేసిన అంబటి రాయుడు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు...

36
Ambati Rayudu

‘2 గ్రేట్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, 2014 మ్యాచులు, 14 సీజన్లు, 11 ప్లేఆఫ్స్, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు.. ఈ రాత్రి ఆరో టైటిల్ గెలుస్తామని నమ్ముతున్నా. ఇది ఓ చక్కని ప్రయాణం. ఈ రాత్రి ఫైనల్ నా ఐపీఎల్ ప్రయాణంలో ఆఖరి మ్యాచ్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నా. ఈ గొప్ప టోర్నీని ఆడడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశాడు. థ్యాంక్యూ ఆల్.. నో యూ టర్న్’ అంటూ ట్వీట్ చేశాడు అంబటి రాయుడు..

46
Image Credit: Instagram

2019 వన్డే వరల్డ్ కప్‌లో తనకి చోటు దక్కకపోవడంతో మనస్థాపం చెందిన అంబటి రాయుడు, సెలక్టర్ల మీద కోపంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు అర్ధాంతరంగా ప్రకటించాడు. అయితే ఆ తర్వాత ఆ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకున్నాడు..

56

అయితే 2019 తర్వాత అంబటి రాయుడికి మళ్లీ టీమిండియాలో చోటు దక్కలేదు. టీమిండియా తరుపున 55 వన్డేలు, 6 టీ20 మ్యాచులు ఆడిన అంబటి రాయుడు, వన్డేల్లో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలతో 1694 పరుగులు చేశాడు... 

66

ఐపీఎల్ కెరీర్‌లో 203 మ్యాచులు ఆడిన అంబటి రాయుడు, 186 ఇన్నింగ్స్‌ల్లో 4329 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

click me!

Recommended Stories