మా టీమ్‌లో నెక్స్ట్ పొలార్డ్ అతడే : ఆసీస్ ఆటగాడిపై రోహిత్ ప్రశంసలు

Published : May 01, 2023, 01:09 PM IST

IPL 2023: ముంబై ఇండియన్స్ - రాజస్తాన్ రాయల్స్ మధ్య  ఆదివారం ముగిసిన ఉత్కంఠభరిత పోరులో ముంబై థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. 

PREV
16
మా టీమ్‌లో నెక్స్ట్  పొలార్డ్ అతడే : ఆసీస్ ఆటగాడిపై  రోహిత్ ప్రశంసలు

గత ఐపీఎల్ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్  కు ఆడుతున్న ఆస్ట్రేలియా యువ సంచలనం టిమ్ డేవిడ్ పై  ముంబై సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. అతడు ముంబైకి  పొలార్డ్ స్థానాన్ని భర్తీ చేస్తాని   ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబైకి పొలార్డ్ చాలాకాలం పాటు సేవలందించాడని, ఇప్పుడు డేవిడ్ ను చూస్తుంటే అతడి వారసుడిగా కనబడుతున్నాడని అన్నాడు. 

26
Image : PTI

మ్యాచ్ ముగిశాక రోహిత్ మాట్లాడుతూ.. ‘మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ మా టీమ్ కు చాలా కాలం పాటు సేవలందించాడు. మేం ఐదు సార్లు ఛాంపియన్లుగా నిలవడానికి అతడు కీలక పాత్ర పోషించాడు.  ఇప్పుడు ఆ స్థానాన్ని టిమ్ డేవిడ్ భర్తీ చేశాడు.

36

టిమ్ బ్యాటింగ్ లో చాలా పవర్ ఉంది. లోయరార్డర్ లో  అటువంటి బ్యాటర్ ఉండటం  ఏ జట్టుకైనా చాలా అవసరం. డేవిడ్ వంటి పవర్ హిట్టర్ క్రీజులో ఉంటే ఎంతటి బౌలర్ అయినా భయపడతాడు. ఒత్తిడికి లోనవుతాడు...’అని తెలిపాడు. కాగా సుదీర్ఘకాలం పాటు ముంబైకి సేవలందించిన  పొలార్డ్ ఈ ఏడాది నుంచి బ్యాటింగ్ కోచ్ గా ఉన్నాడు. 

46

కాగా నిన్నటి మ్యాచ్ లో టిమ్ డేవిడ్..  14 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సాయంతో  45 పరుగులు చేశాడు.  జేసన్ హోల్డర్ వేసిన ఆఖరి ఓవర్లో  వరుస బంతుల్లో మూడు సిక్సర్లు బాది ముంబైకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.  ఐపీఎల్ లో ఇది వెయ్యో మ్యాచ్ కాగా.. రోహిత్ కు బర్త్ డే గిఫ్ట్ కూడా మరీ మరీ స్పెషల్  అయింది. 

56

టిమ్ డేవిడ్ తో పాటు  రాజస్తాన్ ఓపెనర్ జైస్వాల్  బ్యాటింగ్ పై కూడా రోహిత్ ప్రశంసలు కురిపించాడు.   ‘నేను జైస్వాల్ బ్యాటింగ్ ను గతేడాది నుంచి చూస్తున్నా.  అతడు నెక్స్ట్ లెవల్ బ్యాటర్.  ఇవాళ్టి మ్యాచ్ లో   జైస్వాల్ సెంచరీ చేసిన తర్వాత  నేను అతడితో నీకు ఇంత  పవర్ ఎక్కడి నుంచి వస్తుందని అడిగాను.. 

66

దానికి అతడు తాను తరుచూ జిమ్ కు వెళ్తున్నానని, అందువల్లే ఇంత అవలీలగా సిక్సర్లు కొడుతున్నానని చెప్పాడు.  ఈ మ్యాచ్ లో  అతడి ఆట అద్భుతం.  ఇది అతడికి వ్యక్తిగతంగానే గాక రాజస్తాన్ రాయల్స్ కు.. మరీ ముఖ్యంగా  టీమిండియాకు చాలా మేలు చేసేదే..’అని  తెలిపాడు. 

click me!

Recommended Stories