రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా... ముగ్గురూ ముంబై ప్లేయర్లే! మరి ఫైనల్ చేరేదెవరు...

Published : May 24, 2023, 11:44 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ మొదటి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ని చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, రికార్డు స్థాయిలో పదోసారి ఫైనల్ చేరుకుంది.ఇక మిగిలిన మరో ఫైనల్ బెర్త్ కోసం మూడు జట్లు పోటీలో నిలిచాయి...  

PREV
16
రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా... ముగ్గురూ ముంబై ప్లేయర్లే! మరి ఫైనల్ చేరేదెవరు...

లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, గుజరాత్ టైటాన్స్‌తో రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడుతుంది... ఇక్కడ విశేషం ఏంటంటే ఈ మూడు జట్ల కెప్టెన్లు కూడా ముంబై ఇండియన్స్‌కి ఆడిన వాళ్లే...

26
Pandya Brothers

ఐపీఎల్ 2012 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ, 2013లో కెప్టెన్‌గా మారి మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ద్వారా వెలుగులోకి వచ్చి, టీమిండియాకి ఆడిన ప్లేయర్లలో హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా బ్రదర్స్ కూడా ఉన్నారు...

36

ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో తనకు చోటు దక్కకపోవడంతో తెగ ఫీలైపోయిన హార్ధిక్ పాండ్యా, గుజరాత్ టైటాన్స్ టీమ్‌కి వెళ్లి కెప్టెన్‌గా మొదటి సీజన్‌లోనే టైటిల్ గెలిచాడు... 2023 గ్రూప్ స్టేజీలో 10 విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్, సీఎస్‌కేతో జరిగిన మొదటి క్వాలిఫైయర్‌లో తొలిసారి ఆలౌట్ అయ్యింది...
 

46
Image credit: PTI

ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఐపీఎల్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలబడనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్‌కి చేరిన ప్రతీసారీ టైటిల్ గెలిచింది ముంబై ఇండియన్స్. దీంతో లక్నో, ముంబై మధ్య పోరు ఆసక్తికరంగా మారింది...
 

56
hardik pandya

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 2023 ఫైనల్ బెర్త్ కోసం ముగ్గురు ముంబై ఇండియన్స్ ప్లేయర్ల మధ్య పోటీ జరగనుంది... 

66

‘ముగ్గురు ముంబై ఇండియన్స్‌, ఫైనల్ ప్లేస్ కోసం పోటీపడబోతున్నారు, మీ సపోర్ట్ ఎవరికి’ అంటూ రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు. రోహిత్ శర్మ, హార్ధిక్, కృనాల్.. వీరిలో ఏ ముంబై ప్లేయర్ ఫైనల్ చేరి, ధోనీ టీమ్‌తో తలబడతాడో చూడాలి.. 
 

Read more Photos on
click me!

Recommended Stories