చెన్నైలో ఉంటే అంతే! ఆర్‌సీబీకి వచ్చేయ్ జడ్డూ... రవీంద్ర జడేజాకి ఫ్యాన్స్ క్రేజీ ఆఫర్...

First Published May 24, 2023, 9:44 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ మొదటి క్వాలిఫైయర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ని ఓడించి, ఫైనల్‌కి దూసుకెళ్లింది చెన్నై సూపర్ కింగ్స్. గత ఐదేళ్లలో మొదటి క్వాలిఫైయర్ గెలిచి ఫైనల్ చేరిన జట్లే విజేతలుగా నిలిచాయి..

Ravindra Jadeja Dhoni

2018లో చెన్నై సూపర్ కింగ్స్, 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్ మొదటి క్వాలిఫైయర్ గెలిచి ఫైనల్ చేరి, టైటిల్ విజేతలుగా నిలిచాయి. 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కూడా ఇదే సీన్ రిపీట్ చేశాయి...
 

PTI PhotoR Senthil Kumar)(PTI05_10_2023_000319B)

2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరినా ఆ టీమ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం సంతోషంగా లేడు. దీనికి కారణం మాహీ ఫ్యాన్స్. జడ్డూ క్రీజులోకి వచ్చిన ప్రతీసారీ అతను త్వరగా అవుట్ అవ్వాలని, మాహీకి స్ట్రైయిక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్...

Latest Videos


(PTI PhotoR Senthil Kumar)(PTI05_06_2023_000205B)

2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న రవీంద్ర జడేజా దీన్ని తట్టుకోలేకపోయాడు. ఆఖరి లీగ్ మ్యాచ్ తర్వాత సీఎస్‌కే ఫ్యాన్స్ ప్రవర్తనకు చిన్నబుచ్చుకుని, ‘కర్మ’ సిద్ధాంతాన్ని సూచించే కొటేషన్‌ని పోస్ట్ చేశాడు...

తాజాగా మొదటి క్వాలిఫైయర్ తర్వాత ‘మోస్ట్ వాల్యూబుల్ అసెట్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన జడేజా.. ‘వీళ్లకి తెలిసింది, కొంతమంది ఫ్యాన్స్‌కి మాత్రం తెలియడం లేదు’ అంటూ ట్వీట్ చేశాడు..

jadeja

దీనికి సీఎస్‌కే ఫ్యాన్స్ స్పందన ఎలా ఉన్నా, ఆర్‌సీబీ ఫ్యాన్స్ నుంచి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ‘ఆర్‌సీబీ‌లోకి వచ్చేయ్ జడ్డూ’ అంటూ బెంగళూరు ఫ్యాన్స్, జడేజాకి క్రేజీ ఆఫర్ ఇస్తున్నారు...
 

PTI PhotoR Senthil Kumar)(PTI04_30_2023_000246B)

మా టీమ్‌లో ఉంటే అనుజ్ రావత్, షాబజ్ అహ్మద్ లాంటి కుర్రాళ్లనే గుండెళ్లో పెట్టుకుని చూసుకుంటాం, నువ్వు వస్తే నీకు గుడి కట్టేస్తాం దేవరా... అంటూ రవీంద్ర జడేజాని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోకి వచ్చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్...

Image credit: PTI

ఆర్‌సీబీ ఫ్యాన్స్ దెబ్బకు ‘Come to RCB’ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. గత సీజన్‌లోనే జడేజా, సీఎస్‌కే నుంచి బయటికి వస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఎం.ఎస్.ధోనీ స్వయంగా జడ్డూ, సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మధ్య విభేదాలను దూరం చేసి, సంధి చేశాడు. 

ఫ్యాన్స్ కోరినట్టు రవీంద్ర జడేజా, ఆర్‌సీబీలోకి వస్తే ఆ జట్టు కష్టాలు సగానికి సగం తీరినట్టే. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లకు తోడు ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించే రవీంద్ర జడేజా కూడా తోడైతే... ఆర్‌సీబీ టైటిల్ ఆశలు నెరవేరడం పెద్ద కష్టమేమీ కాదు. 

click me!