కెఎల్ రాహుల్ ఉండి ఉంటేనా, నల్లమల ఫారెస్ట్ రెఢీ అయ్యేది.. డాట్ బాల్‌కి మొక్కలు నాటే ఆలోచనపై...

First Published May 24, 2023, 10:57 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌ ఫ్లేఆఫ్స్‌లో బీసీసీఐ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్‌లో ఆడే ప్రతీ డాట్ బాల్‌కి 500 మొక్కలు నాటబోతున్నట్టు ప్రకటించిన బీసీసీఐ, డాట్ బాల్ పడిన ప్రతీసారీ సున్నాకి బదులు చెట్టు సింబల్‌ని చూపించింది...

ఐపీఎల్ 2023 మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో 84 డాట్ బాల్స్‌ నమోదయ్యాయి. అంటే ఒక్కో డాట్ బాల్‌కి 500 మొక్కల చొప్పున మొత్తంగా 42 వేల మొక్కలు నాటనుంది బీసీసీఐ...

ఈ ఆలోచనపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఈ సీజన్‌లో నాలుగు మ్యాచుల్లో మొదటి ఓవర్‌లో మెడియిన్ ఇచ్చాడు. 
 

Latest Videos


టీ20ల్లో టెస్టులు ఆడే రాహుల్ ఉండి ఉంటే, బీసీసీఐ నాటే మొక్కలతో ఓ నల్లమల ఫారెస్ట్ రెఢీ అయ్యేదని మీమ్స్ వైరల్ అవుతున్నాయి...
 

అసలు కెఎల్ రాహుల్ ఉండి ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ దాకా వచ్చి ఉండేది కాదని కొందరు కామెంట్లు చేస్తుంటే.. రాహుల్, టీమ్‌కి ఉపయోగపడినా ఉపయోగకపోయినా వేల మొక్కలు నాటించి, పర్యావరణానికి ఎంతో మేలు చేసేవాడని అంటున్నారు అభిమానులు.. 

Image credit: PTI

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కి చేరి ఉంటే బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా వచ్చిన ఆదాయం కంటే మొక్కలు నాటేందుకు ఎక్కువ ఖర్చు అయ్యేదని, లక్కీగా ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్ చేరకపోవడం ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌కి కలిసి వచ్చిందని అంటున్నారు నెటిజన్లు...
 

ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్ 10వ సారి ఫైనల్ చేరింది. మొదటి క్వాలిఫైయర్‌లో ఓడిన గుజరాత్ టైటాన్స్, ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫైయర్ ఆడనుంది.. 

click me!