అతను ఉండి ఉంటే, ఆర్‌సీబీ సగం మ్యాచులు గెలిచి ఉండేది! కేవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు...

Published : Apr 20, 2023, 02:10 PM IST

ఐపీఎల్‌లో 220+ స్కోరు చేసినా, దాన్ని కాపాడుకోలేక చేతులు ఎత్తేయడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి బాగా అలవాటు. 2023 సీజన్‌లో కూడా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇలాగే అట్టర్ ఫ్లాప్ అయ్యారు ఆర్‌సీబీ బౌలర్లు...

PREV
16
అతను ఉండి ఉంటే, ఆర్‌సీబీ సగం మ్యాచులు గెలిచి ఉండేది! కేవిన్ పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు...
PTI Photo) (PTI04_02_2023_000234B)

టీమ్‌లో కీ బౌలర్‌గా ఉంటూ వస్తున్న యజ్వేంద్ర చాహాల్‌ని ఐపీఎల్ 2022 సీజన్‌లో రిటైన్ చేసుకోలేదు ఆర్‌సీబీ... విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, యజ్వేంద్ర చాహాల్‌లను మాత్రమే రిటైన్ చేసుకున్న బెంగళూరు, చాహాల్‌ని వేలానికి వదిలేసింది...

26
Chahal


161 మ్యాచుల్లో 183 వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో, ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉంటే, 137 మ్యాచుల్లో 177 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్, ఈ సీజన్‌లో మరో 7 వికెట్లు తీస్తే... బ్రావో రికార్డును అధిగమిస్తాడు...

36
Image credit: PTI


ఐపీఎల్ 2022 సీజన్‌లో 17 మ్యాచులు ఆడిన యజ్వేంద్ర చాహాల్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ‘పర్పుల్ క్యాప్’ కూడా గెలిచాడు. చాహాల్‌ని తిరిగి జట్టులోకి తీసుకోవడానికి ఇష్టపడని ఆర్‌సీబీ, హర్షల్ పటేల్, వానిందు హసరంగల కోసం పదేసి కోట్లు కుమ్మరించింది..

46

ఐపీఎల్ 2023 సీజన్‌లో 6 మ్యాచుల్లో 11 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్, మార్క్ వుడ్‌తో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు. చాహాల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్...

56

‘రాజస్థాన్ రాయల్స్‌కి యజ్వేంద్ర చాహాల్ ఓ గొప్ప బహుమతిగా దొరికాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని ఎందుకో వదులుకుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అతను ఎప్పుడూ వికెట్లు తీస్తూనే ఉన్నాడు...

66

యజ్వేంద్ర చాహాల్ ఉండి ఉంటే, ఈ సీజన్‌లో ఓడిపోయిన మ్యాచుల్లో ఆర్‌సీబీ కనీసం సగం మ్యాచుల్లో అయినా గెలిచి ఉండేది. ఆర్‌సీబీలో చాహాల్ చేసిన మ్యాజిక్ చూశాక అతన్ని పింక్ జెర్సీలో చూడడం కొంచెం కష్టంగానే ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు కేవిన్ పీటర్సన్..

click me!

Recommended Stories