నేను ఐపీఎల్ ఆడితే ఆ టీమ్‌కే ఆడతా! డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీతో కలిసి... సునీల్ గవాస్కర్ కామెంట్స్...

First Published Apr 20, 2023, 12:59 PM IST

క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన మొట్టమొదటి క్రికెటర్ సునీల్ గవాస్కర్. టెస్టుల్లో రికార్డు స్థాయిలో 34 సెంచరీలు నమోదు చేసిన గవాస్కర్, టీ20 ఫార్మాట్ రావడానికి దశాబ్దాల ముందే రిటైర్మెంట్ తీసుకున్నాడు. 
 

ప్రస్తుతం ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్, తన స్టైల్‌లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలుస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్ సమయంలో విరాట్ కోహ్లీ ఫేలవ ఫామ్‌ని ఉద్దేశంతో ‘విరాట్, అనుష్కతో బ్యాటింగ్ చేసినట్టు బ్యాటింగ్ చేస్తే సరిపోదు...’ అంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి...

PTI PhotoShailendra Bhojak)(PTI04_17_2023_000367B)

అప్పటి నుంచి కాస్త ఆచితూచి మాట్లాడుతున్న సునీల్ గవాస్కర్, ఐపీఎల్‌లో ఏ టీమ్ తరుపున ఆడతారు? అని అడిగిన ప్రశ్నకు తన స్టైల్‌‌లో సమాధానం చెప్పాడు. ‘నేను ముంబై వాడిని కాబట్టి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడేందుకే ఎక్కువ ఇష్టపడతా... ఒకవేళ అది కుదరకపోతే చెన్నై సూపర్ కింగ్స్...
 

Latest Videos


చెన్నై సూపర్ కింగ్స్‌కే ఎందుకు అంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. చెన్నై ఫ్రాంఛైజీ యజమానులు, క్రికెట్‌ని ఎంతో ప్రేమిస్తారు, టీమ్‌లోని ప్లేయర్లకు ఎంతో గౌరవం ఇస్తారు. ఆ టీమ్, ప్లేయర్లతో నడుచుకునే విధానం ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం...

చెన్నై సూపర్ కింగ్స్ యజమానులు, మేనేజ్‌మెంట్ క్రికెట్‌కి ఎంతో సేవ చేశారు. శ్రీనివాసన్ సర్, క్రికెట్‌కి ఎనలేని సేవలు అందించారు. ఇక రెండో కారణం మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోవచ్చు. అతను టీమ్‌ని ఎలా కెప్టెన్సీ చేస్తాడో తెలుసుకోవచ్చు...

అతను ఫీల్డ్‌లో ఉన్నట్టే డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా కూల్‌గా, కామ్‌గా... ఇలా ప్రశాంతంగానే ఉంటాడా? ఏమో... డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళితే ఆ విషయాలు తెలుసుకోవచ్చు. అందుకే సీఎస్‌కే తరుపున ఆడాలనుకుంటా...

ఓ బ్యాటర్‌గా నాతో సందీప్ పాటిల్ ఓపెనింగ్ చేయాలి. అలాగే ఓ ఆల్‌రౌండర్‌గా కపిల్ దేవ్ నా టీమ్‌లో ఉన్నాడు. బౌలర్‌గా బీఎస్ చంద్ర‌శేఖర్, టీ20లకు సరిగ్గా సెట్ అవుతాడు. ఎందుకంటే అతని బౌలింగ్ టెస్టులకు సెట్ కాదు... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. 

click me!