మహేశ్, అల్లు అర్జున్‌లతో సినిమా చేస్తా! రష్మిక ఉండాల్సిందే... మనసులో మాట బయటపెట్టిన డేవిడ్ వార్నర్...

Published : May 24, 2023, 01:15 PM IST

డేవిడ్ వార్నర్ పుట్టి పెరిగింది ఆస్ట్రేలియాలో అయినా, క్రికెటర్‌గా స్టార్‌ డమ్ సంపాదించింది మాత్రం ఐపీఎల్‌లోనే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా 2016 సీజన్‌ గెలిచిన డేవిడ్ వార్నర్, ఐపీఎల్‌లో ఏడు సీజన్లలో 500+ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్నాడు...

PREV
17
మహేశ్, అల్లు అర్జున్‌లతో సినిమా చేస్తా!  రష్మిక ఉండాల్సిందే... మనసులో మాట బయటపెట్టిన డేవిడ్ వార్నర్...

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్, 14 మ్యాచుల్లో 516 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున చాలా మ్యాచుల్లో ఒంటరి పోరాటం చేశాడు డేవిడ్ వార్నర్...
 

27
PTI Photo/Vijay Verma) (PTI04_20_2023_000483B)

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కూడా 58 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 86 పరుగులు చేసి ఒంటరిపోరాటం చేసిన డేవిడ్ వార్నర్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు...

37

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఉన్నప్పటి నుంచే తెలుగు సినిమా హీరోల పాటలకు డ్యాన్స్‌లు చేయడం డేవిడ్ వార్నర్‌కి బాగా అలవాటు. ముఖ్యంగా అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోని ‘బుట్ట బొమ్మ’ సాంగ్‌కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ రావడానికి డేవిడ్ వార్నరే కారణం...

47

తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న డేవిడ్ వార్నర్, క్రికెట్ నుంచి తప్పుకున్నాక సినిమాల్లోకి వస్తే బాగుంటుందని అంటున్నారు అభిమానులు. దీనిపై మొదటిసారిగా స్పందించాడు డేవిడ్ వార్నర్...

57
Rashmika Mandanna

‘నేను మహేశ్ బాబు, అల్లు అర్జున్‌లతో సినిమాలు చేయాలని అనుకుంటున్నా. ఫీమేల్ లీడ్‌గా రష్మిక మంధాన ఉండాలి, ఆమె అల్లుతో కలిసి పనిచేసింది కదా. నేను విలన్‌గా చేస్తా. ఎందుకంటే నా క్యారెక్టర్‌కి అదే బాగా సెట్ అవుతుంది... ’ అంటూ ‘బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ అనే ప్రోగ్రామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డేవిడ్ వార్నర్..

67

అల్లు అర్జున్ ‘పుష్ఫ 2’ సినిమాలోని గంగమ్మ తల్లి గెటప్‌లో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన డేవిడ్ వార్నర్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రవీంద్ర జడేజాని ఇమిటేట్‌ చేస్తూ తన బ్యాటుని కత్తిలా తిప్పాడు..
 

77

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న డేవిడ్ వార్నర్‌ని సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు అల్లు అర్జున్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడని టాక్. అయితే ఈ ఇద్దరినీ కలిపే డైరెక్టర్ ఎవరు అవుతారో చూడాలి..

Read more Photos on
click me!

Recommended Stories