మతీశ పథిరాణా కోసం అంపైర్లతో ధోనీ తొండాట... మైండ్‌గేమ్‌తో విలువైన సమయాన్ని వృథా చేస్తూ...

First Published May 24, 2023, 12:47 PM IST

టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, మైండ్‌గేమ్ ఆడడంలో మాహా నేర్పరి. ఐపీఎల్ 2019 సమయంలో నో బాల్ గురించి డగౌట్ నుంచి క్రీజులోకి వచ్చి అంపైర్లతో గొడవ పడిన ధోనీ, 2023 క్వాలిఫైయర్ సమయంలో మరోసారి అలాంటి ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు...
 

Image credit: PTI

చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత సీఎస్‌కే బౌలర్ మతీశ పథిరాణా, ఫీల్డ్ వదిలి వెళ్లాడు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం పథిరాణాతో బౌలింగ్ వేయించడానికి వీలు లేదని చెప్పారు అంపైర్లు...

16 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీకి ఈ రూల్స్ గురించి తెలియనిది కాదు, అయితే మాహీ కావాలని అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. కావాలని సమయం వృథా చేస్తూ అంపైర్లతో డిస్కర్షన్ జరిపాడు. ఈ విషయాన్ని అంపైర్లు గ్రహించినా ఆట తిరిగి ప్రారంభించడానికి బదులుగా ధోనీ చేస్తున్న పనికి నవ్వుతూ ఉండిపోయారు..

Latest Videos


dhoni pathirana

దాదాపు 4 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగించిన ధోనీ, ఆ తర్వాత అనుకున్నట్టుగానే మతీశ పథిరాణాతో బౌలింగ్ చేయించాడు. ఈ ఆలస్యం కారణంగా నిర్ణీత సమయం కంటే రెండు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది సీఎస్‌కే. అయితే అంపైర్లతో వాగ్వాదం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో ధోనీకి జరిమానా కూడా పడలేదు...

Image credit: PTI

‘ధోనీ తన మైండ్‌సెట్, తెలివిని వాడి అంపైర్లతో నాలు నిమిషాల పాటు చర్చలు జరిపాడు. పథిరాణాతో బౌలింగ్ చేయడానికి అతను చేసిన పని సరైనది కాదు. అయితే అంపైర్లు పరిస్థితి చక్కదిద్ది ఆటను ప్రారంభించడానికి బదులుగా నవ్వుతూ ఉండిపోయారు... ఇది కరెక్ట్ కాదు...’ అంటూ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ట్వీట్ చేశాడు...

dhoni pathirana

విజయ్ శంకర్, రషీద్ ఖాన్ క్రీజులో ఉన్న సమయంలో ఈ తతంగమంతా జరిగింది. ‘ఏది ఏమైనా అంపైర్లు తీసుకునే నిర్ణయాలను ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. హై ప్రెషర్ పరిస్థితుల్లో అంపైర్లు కొన్నిసార్లు తప్పు చేసినా, వాటిని ప్లేయర్లు అంగీకరించాల్సిందే... ఇలా చేయడం కరెక్ట్ కాదు’ అంటూ సునీల్ గవాస్కర్ కామెంట్ చేశాడు.. 

Image credit: PTI

‘పథిరాణా కొద్దిసేపు ఫీల్డ్‌లో లేడు. అతను రావడానికి కాస్త సమయం పట్టింది. ఆ సమయంలో ధోనీ, అంపైర్లతో చర్చలు జరుపుతూ మ్యాచ్ ఆలస్యం చేశాడు...’ అంటూ విజయ్ శంకర్ కూడా కామెంట్ చేశాడు..

‘అక్కడేం జరిగిందో నాకైతే అర్థం కాలేదు. ఏం జరుగుతుందోనని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించా కానీ బాలీవుడ్ గాసిప్స్‌లా నాకేమీ అర్థం కాలేదు...’ అంటూ నవ్వేశాడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్..  

మహేంద్ర సింగ్ ధోనీ చేసిన పని, రోహిత్ శర్మ లేదా హార్ధిక్ పాండ్యా చేసి ఉంటే ఛీటింగ్ చేశారని జనాలు ఆడుకునేవారని, మాహీ కాబట్టి అంపైర్లు కూడా ఏం చేయకుండా నవ్వుతూ ఉండిపోయారని అంటున్నారు ఫ్యాన్స్...  
 

click me!