బుమ్రా, హార్ధిక్ పాండ్యాలాగే ఆ ఇద్దరి గురించి కూడా జనాలు మాట్లాడుకుంటారు... - రోహిత్ శర్మ...

Published : May 24, 2023, 01:53 PM IST

ఐపీఎల్‌లో టీమిండియాకి ఎక్కువ మంది స్టార్ ప్లేయర్లను అందించిన ఘనత ముంబై ఇండియన్స్‌కే దక్కుతుంది. జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్,రాహుల్ చాహార్ ఇలా ఎంతోమంది ప్లేయర్లు ముంబై ఇండియన్స్ ద్వారా వెలుగులోకి వచ్చారు...

PREV
17
బుమ్రా, హార్ధిక్ పాండ్యాలాగే ఆ ఇద్దరి గురించి కూడా జనాలు మాట్లాడుకుంటారు... - రోహిత్ శర్మ...

ఐపీఎల్ 2022, 2023 సీజన్లలో కూడా ముంబై ఇండియన్స్‌ నుంచి కొత్త కుర్రాళ్లు ఆరంగ్రేటం చేశారు, అదరగొట్టారు. తిలక్ వర్మ, నేహాల్ వదేరా, ఆకాశ్ మద్వాల్, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్ వంటి కుర్రాళ్లు ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్నారు...
 

27

వీరితో పాటు విష్ణు వినోద్, రమణ్‌దీప్ సింగ్, అర్జున్ టెండూల్కర్, అర్షద్ ఖాన్ వంటి కుర్రాళ్లకు ఈసారి ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ ఆడే అవకాశం దక్కింది. వీరిలో తిలక్ వర్మ, నేహాల్ వదేరాతో పాటు ఆకాశ్ మద్వాల్ అద్భుతంగా రాణిస్తున్నారు..
 

37
(PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000352B)

ఐపీఎల్ 2023 సీజన్‌లో  9 మ్యాచులు ఆడిన తిలక్ వర్మ, 45.67 యావరేజ్‌తో 274 పరుగులు చేశాడు. అయితే గాయం కారణంగా మిగిలిన 5 మ్యాచులకు దూరంగా ఉన్నాడు తిలక్ వర్మ. ప్లేఆఫ్స్‌లో తిలక్ రీఎంట్రీ ఇస్తే ముంబై కష్టాలు సగం తీరినట్టే...
 

47

‘బుమ్రా, హార్ధిక్, కృనాల్ ఎలాగైతే కష్టపడ్డారో తిలక్ వర్మ, నేహాల్ వదేరా కూడా అంతే కష్టపడుతున్నారు. వీళ్ల కథ కూడా అలాంటిదే. రెండేళ్ల తర్వాత ముంబై ఇండియన్స్‌ని చూసి జనాలు సూపర్ స్టార్ టీమ్ అంటారు. భవిష్యత్తులో ఈ కుర్రాళ్లు ముంబై, టీమిండియా విజయాల్లో కీ రోల్ పోషించబోతున్నారు..

57

ముంబై ఇండియన్స్‌లో డి కాక్, ట్రెంట్ బౌల్ట్ ఉన్నప్పుడు కూడా సూపర్ టీమ్ అనేవాళ్లు. ఇప్పుడు వాళ్లు వేరే టీమ్‌లో ఉన్నారు. అయితే వేరే టీమ్స్‌లో ఈ ప్లేయర్లు తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి కష్టపడుతున్నారు.మా టీమ్‌లో వాళ్లే మ్యాచ్ విన్నర్లుగా ఉన్నారు..’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...

67

రోహిత్ ప్రత్యేక్షంగా చెప్పకపోయినా హార్ధిక్ పాండ్యా వ్యాఖ్యలకు కౌంటర్‌గానే ఈ కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌ నుంచి బయటికి వచ్చి, కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కి ఐపీఎల్ టైటిల్ అందించాడు హార్ధిక్ పాండ్యా...

 

77

2023 సీజన్ ప్రారంభంలో ఓ ఇంటర్వ్యూలో ‘టైటిల్ గెలవడానికి రెండు సిద్దాంతాలు ఉంటాయి. ఒకటి స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసి ఆడించండి. ముంబై ఇండియన్స్ అలాగే చేస్తుంది. ఇంకేటి ప్లేయర్లు ఎలాంటి వారైనా వారి నుంచి బెస్ట్‌ రాబట్టి, గెలవడం ఇది చెన్నై సూపర్ కింగ్స్ ఫాలో అవుతుంది. నేను ఫాలో అయ్యేది ఇదే...’ అంటూ వ్యాఖ్యలు చేశాడు హార్ధిక్ పాండ్యా... 

click me!

Recommended Stories