ఇక ఐపీఎల్ - 16 లో అయితే చెత్త ప్రదర్శనతో 8 మ్యాచ్ లలో 106 పరుగులు చేసి దారుణంగా విఫలమయ్యాడు. సీజన్ ఆరంభంలో అతడు ఆడిన ఆరు మ్యాచ్ లలో స్కోర్లు 12, 7, 0, 15, 0, 13గా ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్ అతడిని పక్కనబెట్టింది. తాజాగా షా పై శుభ్‌మన్ గిల్ చిన్ననాటి కోచ్, టీమిండియా మాజీ పేసర్ కర్సన్ ఘావ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.