ఐపీఎల్ 2023 సీజన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ కూడా ‘మాహీ ఫేర్‌వెల్ సీజన్’గా ఐపీఎల్ 2023ని ప్రమోట్ చేస్తోంది. తాజాగా తన రిటైర్మెంట్‌పై ఉన్న అనుమానాలకు క్లారిటీ ఇచ్చేశాడు ధోనీ...
‘సీజన్ మధ్యలో ఏదీ చెప్పడం సరికాదు. అయితే ఒకటి ఇది నా కెరీర్‌కి చివరి ఫేజ్. నేను ఎంత వరకూ ఆడతానో ప్రతీ మ్యాచ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. రెండేళ్ల తర్వాత చెన్నైలో మ్యాచులు జరుగుతున్నాయి, స్టేడియానికి వచ్చి మ్యాచులు చూడగలుగుతున్నారు. వాళ్లు ఇచ్చిన ప్రేమ, ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను...’ అంటూ కామెంట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ....
28
ధోనీ లాస్ట్ ఫేజ్ అనడంతో ఐపీఎల్ 2023 సీజన్‌తో అతను పూర్తిగా ఆటకు దూరం కాబోతున్నాడనే విషయం స్పష్టమైంది. దీంతో సీఎస్‌కే ఆడే ఆఖరి మ్యాచ్‌లో ధోనీకి ఘనమైన వీడ్కోలు పలకేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి...
38
2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ, 2020 ఆగస్టు 15న ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు భావించాల్సిందిగా ఓ పోస్టు చేసి, సింపుల్‌గా రిటైర్మెంట్ ఇచ్చేశాడు. కనీసం ఫేర్‌వెల్ మ్యాచ్ కూడా లేకుండా ధోనీ తప్పుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
48
అప్పటి నుంచే ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. 2020 సీజన్‌లోనే ధోనీతో ఫోటోలు దిగేందుకు, అతను ఆటోగ్రాఫ్ ఇచ్చిన జెర్సీలను తీసుకునేందుకు యంగ్ క్రికెటర్లు ఎగబడ్డారు. అయితే ధోనీ, ఇప్పుడే కాదని ఆ సీజన్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో క్లారిటీ ఇచ్చాడు..
58
2020 సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, 2021 సీజన్‌లో టైటిల్ గెలిచి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. 2022 సీజన్‌లో 9వ స్థానంలో నిలిచి అట్టర్ ఫ్లాప్ అయిన సీఎస్‌కే, ఈసారి 6 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని టాప్ 3లో ఉంది...
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ చేరితే ఫైనల్‌కి వెళ్లకుండా అడ్డుకోవడం మిగిలిన టీమ్స్‌కి చాలా కష్టమైన విషయం. ప్లేఆఫ్స్ చేరకపోతే మే 20న ఢిల్లీలో జరిగే ఆఖరి సీఎస్‌కే లీగ్ మ్యాచ్, ధోనీకి చివరి ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది..
78
ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కి వెళితే ధోనీ కోరుకున్నట్టుగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సొంత అభిమానుల మధ్య వీడ్కోలు తీసుకునేందుకు వీలుగా చెన్నైలో మొదటి ఎలిమినేటర్, మొదట క్వాలిఫైయర్ మ్యాచులు పెట్టింది బీసీసీఐ...
88
ఒకవేళ ఈ రెండు మ్యాచుల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే... అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో దాదాపు లక్షమంది అభిమానుల మధ్య మాహీకి ఘనమైన వీడ్కోలు దక్కనుంది.. వేదిక అహ్మదాబాద్ అయితే స్టేడియం నిండి మాహీ ఫ్యాన్స్ నిండిపోవడం కామనే..