ఇన్‌స్టాలో ఆర్‌సీబీ, ట్విట్టర్‌లో సీఎస్‌కే, ఫేస్‌బుక్‌లో కేకేఆర్... ఈ టీమ్స్ క్రేజ్ చూస్తే...

First Published May 4, 2023, 10:06 PM IST

ఐపీఎల్‌ 2023 సీజన్‌‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ టేబుల్ టాప్‌లో కొనసాగుతుంటే లక్నో సూపర్ జెయింట్స్ టాప్ 2లో ఉంది. అయితే క్రేజ్ విషయంలో మాత్రం ఆర్‌సీబీ, టాప్‌లో నిలిచింది..

ఐపీఎల్ 2023 సీజన్ మొదలైన తర్వాత మొదటి నెల (ఏప్రిల్)లో సోషల్ మీడియాలో ఎక్కువ చర్చించుకున్న టీమ్స్ లిస్టు తీసింది డీపోర్టే అండ్ ఫినాంజాస్ అనే వెబ్‌సైట్. ఈ లిస్టులో ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది, అత్యధిక సార్లు ఆర్‌సీబీ గురించి చర్చించుకున్నారట..

ఆర్‌సీబీ ఈ సీజన్‌లో 9 మ్యాచుల్లో 5 విజయాలే అందుకుంది. అయితే బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్.. బౌలింగ్‌లో సిరాజ్ మాత్రమే అదరగొడుతున్నారు. ఇదే ఇన్‌స్టాలో ఎక్కువ చర్చనీయాంశమైంది.

Latest Videos


విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ కారణంగా మే నెలలో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ లిస్టులో టాప్‌లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ట్విట్టర్‌లో ధోనీ ఫ్యాన్స్‌ ఎక్కువగా ఉన్నారు..

ట్విట్టర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గురించి, మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఎక్కువ చర్చ జరిగింది. ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చిన అజింకా రహానే కూడా సీఎస్‌కే, ట్విట్టర్‌లో టాప్‌లో నిలవడానికి కారణమైంది..

Image credit: PTI

ఫేస్‌బుక్‌లో షారుక్ టీమ్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ టాప్‌లో నిలిచింది. ఫేస్ బుక్‌లో అభిమానులతో టచ్‌లో ఉంటున్న కేకేఆర్, రింకూ సింగ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్ కారణంగా అక్కడ మంచి పాపులారిటీ తెచ్చుకుంది.. 

అయితే ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ మూడింట్లో కలిపి చూస్తే మాత్రం ఆర్‌సీబీ టాప్‌లో ఉంది. అయితే పాయింట్ల పట్టికలో  10 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 3లో ఉంటే, ఆర్‌సీబీ ఐదో స్థానంలో, కేకేఆర్ 8వ స్థానంలో ఉన్నాయి...

click me!