కోట్లు పెట్టి కొన్నారు, రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతున్నారు... శివమ్ మావి, వివ్‌రాంత్ శర్మతో పాటు...

Published : May 04, 2023, 08:06 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో ప్లేయర్ల కోసం కోట్లు ఖర్చు పెట్టాయి ఫ్రాంఛైజీలు. సామ్ కుర్రాన్ రూ.18.5 కోట్లు దక్కించుకోగా, కామెరూన్ గ్రీన్ రూ.17.5 కోట్లకు అమ్ముడుపోయాడు. అయితే ఐపీఎల్ 2023 వేలంలో భారీ ధర దక్కించుకున్న కొందరు ప్లేయర్లు, రిజర్వు బెంచ్‌లో మగ్గిపోతున్నారు...

PREV
18
కోట్లు పెట్టి కొన్నారు, రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడుతున్నారు... శివమ్ మావి, వివ్‌రాంత్ శర్మతో పాటు...

శివమ్ మావి: గతంలో ఐదు సీజన్ల పాటు కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కి ఆడిన శివమ్ మావిని ఐపీఎల్ 2023 వేలంలో రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్‌లో 32 మ్యాచులు ఆడి 30 వికెట్లు తీసిన శివమ్ మావి, ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన ఇంప్రెస్ చేసిన ఈ బౌలర్‌ని దాచి పెడుతున్నాడు హార్ధిక్ పాండ్యా.. 

28
Vivrant Sharma

వివ్‌రాంత్ శర్మ:ఐపీఎల్ 2023 వేలంలో రూ.2 కోట్ల 60 లక్షలకు వివ్‌రాంత్ శర్మను కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. స్పిన్ ఆల్‌రౌండర్‌ అయితే వివ్‌రాంత్, దేశవాళీ టోర్నీల్లో చక్కగా రాణిస్తున్నాడు. ఇప్పటికే అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ రూపంలో ఇద్దరు జమ్ము కశ్మీర్ కుర్రాళ్లను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్, వివ్‌రాంత్‌ని ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు..

38

కెఎస్ భరత్: ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడిన శ్రీకర్ భరత్‌ని ఐపీఎల్ 2023 వేలంలో రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. అయితే వృద్ధిమాన్ సాహా రూపంలో సీనియర్ వికెట్ కీపర్ అందుబాటులో ఉండడంతో శ్రీకర్ భరత్, ఇప్పటిదాకా రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు.

48

నిశాంత్ సింధు: హర్యానాకి చెందిన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ ఆల్‌రౌండర్‌ నిశాంత్ సింధుని, చెన్నై సూపర్ కింగ్స్ రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పటిదాకా ఈ ఆల్‌రౌండర్‌కి ఆరంగ్రేటం చేసే అవకాశం కూడా ఇవ్వలేదు సీఎస్‌కే..

58

జో రూట్: ఇంగ్లాండ్ టెస్టు మాజీ కెప్టెన్ జో రూట్‌ని బేస్ ప్రైజ్ రూ.1 కోటికి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. జోస్ బట్లర్, ఆడమ్ జంపా, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సిమ్రాన్ హెట్మయర్ రూపంలో ఫారిన్ ప్లేయర్లు పుష్కలంగా ఉండడంతో జో రూట్, కేవలం వాటర్ బాయ్‌గా మారాడు.. 

68

డానియల్ సామ్స్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డానియల్ సామ్స్‌ని వేలంలో రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున 13 వికెట్లు తీసిన డానియల్ సామ్స్‌, ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 

78

రజన్ కుమార్: హరిద్వార్‌కి చెందిన రజన్ కుమార్‌ని రూ.70 లక్షలకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. దేశవాళీ క్రికెట్‌లో 5 కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన రజన్ కుమార్ ఇప్పటిదాకా ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు... 

88

సీఎస్‌కేనే ఆదర్శం...

ఐపీఎల్ 2021 మినీ వేలంలో కృష్ణప్ప గౌతమ్‌ని రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే దాదాపు రూ.10 కోట్లు పెట్టినా ఆ సీజన్‌లో గౌతమ్‌ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదు సీఎస్‌కే. ధోనీ టీమ్ చేసిన దాంతో పోలిస్తే మిగిలిన టీమ్స్ చేస్తున్నది చాలా తక్కువే.. 

click me!

Recommended Stories