2021లో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌కి ముందు టెస్టుల్లో చోటు దక్కించుకోవడానికి తెగ కష్టపడాల్సి వచ్చింది కెఎల్ రాహుల్. మయాంక్ అగర్వాల్ సూపర్ హిట్ కావడంతో 2019లో టెస్టుల్లో చోటు కోల్పోయిన కెఎల్ రాహుల్, మళ్లీ 2021 ఇంగ్లాండ్ టూర్‌లోనే తుదిజట్టులోకి వచ్చాడు. లక్ బాగా కలిసి రావడంతో టెస్టుల్లో వైస్ కెప్టెన్సీ కొట్టేశాడు...
అజింకా రహానే పేలవ ఫామ్‌లో వైస్ కెప్టెన్సీ కోల్పోయాడు. ఆ తర్వాత కొన్ని మ్యాచులకే టీమ్‌లో ప్లేస్ కూడా కోల్పోయాడు. అజింకా రహానే ప్లేస్‌లో రోహిత్ శర్మను టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంతో రోహిత్‌కి కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి..
28
2020 ఆస్ట్రేలియా టూర్‌లో ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అయ్యాడు శుబ్‌మన్ గిల్. అప్పటి నుంచి టీమిండియా టెస్టు ఓపెనర్‌గా ఉంటూ వచ్చాడు. గిల్ కారణంగా మయాంక్ అగర్వాల్ తుది జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గిల్ గాయపడడంతో 2021 ఇంగ్లాండ్ టూర్‌లో మయాంక్ అగర్వాల్‌కి ఛాన్స్ దక్కింది.
38
అయితే తొలి టెస్టుకి ముందు మయాంక్ అగర్వాల్‌కి ప్రాక్టీస్ సెషన్స్‌లో తీవ్ర గాయమైంది. అనుకోకుండా మయాంక్ జట్టుకి దూరం కావడంతో రెండేళ్ల గ్యాప్ తర్వాత టెస్టుల్లోకి వచ్చాడు కెఎల్ రాహుల్. అదే సిరీస్‌లో సెంచరీ చేసి, టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు...
48
కెఎల్ రాహుల్‌పై విపరీతమైన ప్రేమ పెంచుకున్న బీసీసీఐ... అతని కోసం అప్పటిదాకా టెస్టుల్లో అదరగొట్టిన మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్‌లను పక్కనబెట్టేసింది. రోహిత్ శర్మ గాయపడడంతో శుబ్‌మన్ గిల్‌కి మరోసారి అదృష్టం తలుపు తట్టింది...
58
బంగ్లాదేశ్ టూర్‌లో సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్, స్పిన్ పిచ్‌లపై కూడా చక్కగా రాణించగలనని నిరూపించుకున్నాడు. ఇదే సిరీస్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా 30+ స్కోరు చేయలేకపోయాడు..
68
దీంతో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌లో ఓపెనర్లుగా ఎవరిని ఆడించాలనే ప్రశ్న రేగుతోంది. మయాంక్ అగర్వాల్‌కి స్వదేశంలో అదిరిపోయే రికార్డు ఉంది. శుబ్‌మన్ గిల్ సెంచరీతో ఫామ్ నిరూపించుకున్నాడు. రోహిత్ రీఎంట్రీ ఇస్తే... కెఎల్ రాహుల్ సంగతేంటి?
78
‘ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఆడితే.. కెఎల్ రాహుల్ రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సిందే. వైస్ కెప్టెన్ అయినంత మాత్రం ఫామ్‌లో లేకపోయినా ఆడించాల్సిన అవసరం లేదు...
88
Rohit-Rahul
అదీకాకుండా టీమిండియా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ విజయం చాలా అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్..