కుర్రాళ్లు సిద్ధంగా ఉండండి! త్వరలో టీమిండియాకి ఆడబోయే యంగ్ స్టర్స్ వీళ్లే... తిలక్ వర్మతో పాటు...

Published : May 01, 2023, 07:55 PM IST

ఐపీఎల్, టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి రాచ మార్గం. ఒకప్పుడు దేశవాళీ టోర్నీల్లో ఎంతో అనుభవం గడించి, టన్నుల కొద్దీ పరుగులు చేస్తే కానీ సెలక్టర్లు, ఆ ప్లేయర్‌ని పరిగణించేవాళ్లు కాదు.ఇప్పుడు ఐపీఎల్‌లో బాగా ఆడితే చాలు, ఇండియాకి ఆడేయొచ్చు...  

PREV
17
కుర్రాళ్లు సిద్ధంగా ఉండండి! త్వరలో టీమిండియాకి ఆడబోయే యంగ్ స్టర్స్ వీళ్లే... తిలక్ వర్మతో పాటు...

హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, నటరాజన్, ప్రసిద్ధ్ కృష్ణ ఇలా ఐపీఎల్‌ నుంచి టీమిండియాలోకి వచ్చిన ప్లేయర్లు ఎందరో. ఈసారి కూడా ఐపీఎల్‌లో కుర్రాళ్లు అదరగొడుతూ టీమిండియా తలుపులు బాదుతున్నారు.. 

27

యశస్వి జైస్వాల్: ఐపీఎల్ 2023 సీజన్‌లో 8 మ్యాచుల్లో 423 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, 3 హాఫ్ సెంచరీలతో పాటు ఓ అద్భుత సెంచరీ బాదాడు. ఈ 21 ఏళ్ల కుర్రాడికి టీమిండియా నుంచి పిలుపు రావడం దాదాపు ఖాయమే. అయితే రిజర్వు బెంచ్‌లో కూర్చుంటాడా? ఆరంగ్రేటం కూడా చేసి అదరగొడతాడా? అనేది అతని అదృష్టంపైనే ఆధారపడి ఉంది.

37
(PTI Photo/Ravi Choudhary)(PTI04_11_2023_000352B)

తిలక్ వర్మ: ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న ఈ తెలుగు కుర్రాడు, 8 మ్యాచుల్లో 248 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసి ముంబై బ్యాటర్‌గా ఉన్నాడు. 41.33 యావరేజ్, 152.15 స్ట్రైయిక్ రేటుతో అదరగొడుతున్న తిలక్ వర్మ, మిడిల్ ఆర్డర్‌లో రాణిస్తూ సెలక్టర్ల తలుపులు బాదుతున్నాడు. 

47
Image credit: PTI

రాహుల్ తెవాటియా: రెండు సీజన్లుగా ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా గురించి చర్చ జరుగుతోంది. 2020 సీజన్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదిన రాహుల్ తెవాటియా, ఆ తర్వాత ఆ రేంజ్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అయితే 179.17 స్ట్రైయిక్ రేటుతో అదరగొట్టే తెవాటియా, ఆల్‌రౌండర్‌గా టీమ్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు. 

57
Jitesh Sharma

జితేశ్ శర్మ: రిషబ్ పంత్ గాయంతో బాధపడుతుండడం, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ నిలకడగా రాణించడంలో ఫెయిల్ అవుతుండడం ఈ యంగ్ వికెట్ కీపర్‌కి బాగా కలిసి రావచ్చు. 9 మ్యాచుల్లో 190 పరుగులు చేసిన జితేశ్ శర్మ, 162.39 స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

67
Rinku Singh

రింకూ సింగ్: 2023 సీజన్‌లో హైలైట్ ఇన్నింగ్స్ ఆడాడు రింకూ సింగ్. టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో ఆఖరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాదిన రింకూ సింగ్, గత 2 మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు. మిగిలిన మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో రింకూ సింగ్ నుంచి అదిరిపోయే ఇన్నింగ్స్ వస్తే, అతనికి టీమ్ నుంచి పిలుపు రావడం పక్కా..

77

సుయాశ్ శర్మ: దేశవాళీ అనుభవం లేకుండా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు. కేకేఆర్‌కి ఇంపాక్ట్ ప్లేయర్‌గా మారిన సుయాశ్ శర్మ, 7 మ్యాచుల్లో 9 వికెట్లు తీశాడు. ఈ యంగ్ స్పిన్నర్‌కి టీమిండియా నుంచి పిలుపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  

click me!

Recommended Stories