దాస్ కా ధమ్కీ.. కేకేఆర్‌కు షాకిచ్చిన లిటన్ దాస్.. రిప్లేస్మెంట్ ప్రకటించిన కోల్కతా

Published : May 04, 2023, 12:21 PM IST

IPL 2023: బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్.. ఐపీఎల్ లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కోల్కతా నైట్ రైడర్స్‌కు షాకిచ్చాడు. సీజన్ నంచి తప్పుకున్నాడు. 

PREV
16
దాస్ కా ధమ్కీ.. కేకేఆర్‌కు షాకిచ్చిన లిటన్ దాస్..  రిప్లేస్మెంట్ ప్రకటించిన కోల్కతా

ఐపీఎల్-16లో ఆడిన 9 మ్యాచ్‌లలో  మూడింట్లో మాత్రమే గెలిచి  పాయింట్ల పట్టికలో  8వ స్థానంలో ఉన్న  కోల్కతా నైట్ రైడర్స్ కు ఆ జట్టు  వికెట్ కీపర్ బ్యాటర్ లిటన్ దాస్ మరో షాకిచ్చాడు.  ఇటీవలే  కేకేఆర్ క్యాంప్ ను వీడిన అతడు ఇకపై  జరుగబోయే మ్యాచ్ లకు కూడా అందుబాటులో ఉండనని  తేల్చేశాడు. 

26

ఈ సీజన్ లో   కేకేఆర్ మూడు మ్యాచ్ లు ఆడిన తర్వాత వచ్చిన  లిటన్ దాస్.. ఢిల్లీ క్యాపిటల్స్ తో  జరిగిన ఒక్క మ్యాచ్ లోనే ఆడాడు. ఆ మ్యాచ్ లో కూడా పెద్దగా రాణించలేదు.  బ్యాటర్ గా  4 పరుగులే చేసిన దాస్.. వికెట్ కీపర్ గా కూడా పెద్దగా రాణించలేదు.  

36

ఇటీవలే  ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన తర్వాత  అతడు మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో  కేకేఆర్ క్యాంప్ ను వీడాడు.  అదే సమయంలో అతడు తిరిగి   కోల్కతాతో చేరేది కష్టమేన్న వానలు వినపడ్డాయి.  ఇప్పుడు అవే నిజమయ్యాయి.   మెడికల్ ఎమర్జెన్సీ  పేరిట అతడు  కేకేఆర్ క్యాంప్ ను వీడినా  మే 9 నుంచి  ఐర్లాండ్ తో జరుగబోయే వన్డే సిరీస్ ఆడేందుకు ఐపీఎల్ ను వీడాడు. 

46
Image credit: PTI

తాజాగా దాస్ ప్లేస్ ను కేకేఆర్ రిప్లేస్ చేసింది.  వెస్టిండీస్  బ్యాటర్  జాన్సన్ ఛార్లెస్.. దాస్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఈ మేరకు కేకేఆర్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.  ఐపీఎల్ -2023 సీజన్ కు ముందు జరిగిన వేలంలో అతడు పేరిచ్చినా   ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగోలు చేయలేదు. ఇప్పుడు  కేకేఆర్ అతడిని బేస్ ప్రైస్  రూ. 50 లక్షలకు కొనుగోలు చేసింది. 

56
Johnson Charles

జాన్సన్  ఛార్లెస్..  వెస్టిండీస్ జట్టు 2012, 2016లలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన  జట్లలో సభ్యుడిగా ఉన్నాడు. కానీ 2017 తర్వాత ఫామ్ కోల్పోయి జట్టును వీడాడు.  ఆరేండ్ల తర్వాత  ఇటీవలే విండీస్ జట్టుకు రీఎంట్రీ ఇచ్చాడు. 

66

వెస్టిండీస్ జట్టు.. ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో  రాణించాడు.  మూడు మ్యాచ్ లలో 146 పరుగులు చేశాడు.  ఈ క్రమంలో అతడు ఓ సెంచరీ కూడా చేయడం విశేషం.  తన అంతర్జాతీయ కెరీర్ లో  ఛార్లెస్..  40 మ్యాచ్ లు ఆడి  971 పరుగులు చేశాడు. 

click me!

Recommended Stories