ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి ఊహించని షాక్ తగిలింది. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన కెఎల్ రాహుల్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు..
హర్మ్‌స్టింగ్ గాయంతో బాధపడుతున్న కెఎల్ రాహుల్, పూర్తిగా కోలుకోవడానికి నాలుగు వారాల నుంచి 5 వారాల సమయం పడుతుందని వైద్యులు నిర్ధారించినట్టు సమచారం..
28
KL Rahul
దీంతో ఐపీఎల్ 2023 సీజన్‌తో పాటు ఆ తర్వాత 10 రోజులకు జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కూడా కెఎల్ రాహుల్ ఆడడం అనుమానమే..
38
ఆర్‌సీబీతో లక్నోలో జరిగిన మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో ఫాఫ్ డుప్లిసిస్ కొట్టిన ఫోర్‌ని ఆపేందుకు ప్రయత్నించిన కెఎల్ రాహుల్, తొడ కండరాలు పట్టుకోవడంతో కిందపడిపోయాడు. లేచి నడవడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు కెఎల్ రాహుల్...
48
ఫిజియో సాయంతో క్రీజు వీడిన కెఎల్ రాహుల్, 9వ వికెట్ పడిన తర్వాత ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చాడు. అయితే తొడ కండరాలు పట్టేయడంతో సింగిల్ తీయడానికి కూడా ఇబ్బంది పడిన కెఎల్ రాహుల్, 3 బంతులు ఆడినా పరుగులేమీ చేయలేకపోయాడు.
58
కెఎల్ రాహుల్ ఆడకపోతే లక్నో సూపర్ జెయింట్స్‌కి వచ్చిన పెద్ద ప్రమాదమేమీ లేదు. రాహుల్ టెస్టు బ్యాటింగ్‌తో ప్రేక్షకులను విసిగిస్తూ, ప్రత్యర్థి టీమ్‌కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అతని గాయం లక్నోని దెబ్బ తీయకపోయా, మరో హిట్టర్‌ని ఆడించేందుకు ఉపయోగపడొచ్చు...
68
KL Rahul
అది పక్కనబెడితే కెఎల్ రాహుల్ కూడా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌లో కూర్చున్నాడు..
78
KL Rahul
ప్రాక్టీస్ లేని శ్రీకర్ భరత్ కంటే టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న కెఎల్ రాహుల్‌ని వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా ఫైనల్‌లో మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని భావించింది టీమిండియా. అతని గాయం, ఆ ప్లాన్స్‌ని మార్చేయొచ్చు.
88
ఇదే మ్యాచ్ ఆరంభానికి ముందు నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ జారపడి భుజానికి గాయం చేసుకున్న జయ్‌దేవ్ ఉనద్కట్ గురించి ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాలేదు. కెఎల్ రాహుల్ గాయంతో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌కి కృనాల్ పాండ్యా కెప్టెన్సీ చేశాడు. అతనే మిగిలిన సీజన్‌కి కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది.