హెజిల్వుడ్ వస్తే ఆర్సీబీ బౌలింగ్ విభాగం మరింత పటిష్టమవుతుంది. సిరాజ్ రాణిస్తున్నా వేన్ పార్నెల్, వైశాఖ్ విజయ్ కుమార్ లు విఫలమవుతున్నారు. దీంతో రాజస్తాన్ తో మ్యాచ్ లో ఆర్సీబీ డేవిడ్ విల్లేను ఆడించింది. అతడు ఫర్వాలేదనిపించాడు. అయితే కేకేఆర్ తో మ్యాచ్ లో హెజిల్వుడ్ ఆడితే మాత్రం విల్లే బెంచ్ కే పరిమితమవుతాడు.