మ్యాచ్ గెలిచినా జరిమానా తప్పలే.. వార్నర్‌కు షాకిచ్చిన ఐపీఎల్

First Published Apr 25, 2023, 2:19 PM IST

IPL 2023: ఐపీఎల్ - 16లో ఐదు పరాజయాల తర్వాత  విజయాల బాట పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో  గెలుపొందింది.  

ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ -  ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య   సోమవారం  రాత్రి ముగిసిన లో స్కోరింగ్ థ్రిల్లర్ లో   ఏడు పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీకి  ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు.   మ్యాచ్ గెలిచినా వార్నర్‌కు జరిమానా  పడింది. 

ఈ మ్యాచ్ లో  స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేసినందుకు గాను  వార్నర్ భాయ్  కు రూ. 12 లక్షల జరిమానా విధిస్తున్నట్టు   ఐపీఎల్  ఓ  ప్రకటనలో వెల్లడించింది.  ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు గాను  వార్నర్ కు జరిమానా విధించినట్టు  ఆ  ప్రకటనలో పేర్కొంది. 

Latest Videos


ఈ సీజన్ లో వార్నర్  కంటే ముందు  జరిమానా ఎదుర్కున్న కెప్టెన్లు.. ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ), సంజూ శాంసన్ (రాజస్తాన్ ), సూర్యకుమార్ యాదవ్ (ముంబై),  హార్ధిక్ పాండ్యా (గుజరాత్), కెఎల్ రాహుల్ (లక్నో) విరాట్ కోహ్లీ (ఆర్సీబీ) జాబితాలో ఉన్నారు.  

పైన పేర్కొన్న వారిలో  ఆర్సీబీకి  రెండుసార్లు జరిమానా పడింది.  ఒకసారి లక్నోతో మ్యాచ్ లో మరోసారి ఇటీవలే  ముగిసిన రాజస్తాన్ తో మ్యాచ్ లో  స్లో ఓవర్ రేట్  మెయింటెన్ చేసినందుకు గాను  ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు.  అయితే  ఫైన్ మాత్రం  డుప్లెసిస్, కోహ్లీలు ఎదుర్కున్నారు. 

Image credit: PTI

కోహ్లీకి ఐపీఎల్-16 సీజన్ లో  జరిమానా పడటం ఇది రెండోసారి.   చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో కోహ్లీ.. జరిమానా ఎదుర్కున్నాడు.  ఆ మ్యాచ్ లో కోహ్లీ  ప్రవర్తన కారణంగా  ఫైన్ పడింది. చెన్నై బ్యాటర్ శివమ్ దూబే నిష్క్రమించిన తర్వాత  కోహ్లీ సెలబ్రేషన్స్ శృతి మించడంతో  ఐపీఎల్ మందలించింది.  అప్పుడు కోహ్లీ.. 12 లక్షల  జరిమానా ఎదుర్కున్నాడు. 

ఇక నిన్నటి  హైదరాబాద్ - ఢిల్లీ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన   వార్నర్ సేన.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి  144  పరుగులు చేసింది. కానీ స్వల్ప లక్ష్య ఛేదనలో కూడా హైదరాబాద్ తడబడింది. హ్యారీ బ్రూక్ (7), రాహుల్ త్రిపాఠి (15), అభిషేక్ శర్మ (5), మార్క్‌రమ్ (3) లు దారుణంగా విఫలమయ్యారు. మయాంక్ అగర్వాల్ (49), హెన్రిచ్ క్లాసెన్ (31) ఫర్వాలేదనిపించినా వాళ్లు మ్యాచ్ ను గెలిపించలేకపోయారు. హైదరాబాద్  20 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే  చేయగలిగింది. 

click me!