ఆడినా, ఆడకపోయినా ఆర్చర్ ఉండాల్సిందే! జోఫ్రాకి ముంబై ఇండియన్స్ నుంచి క్రేజీ ఆఫర్...

Published : May 11, 2023, 04:32 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన స్టార్ ప్లేయర్లలో జోఫ్రా ఆర్చర్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు. జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా 2023 సీజన్ నుంచి తప్పుకోవడంతో ఆర్చర్‌పై ఆశలన్నీ పెట్టుకుంది ముంబై ఇండియన్స్. అయితే ఆర్చర్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...  

PREV
16
ఆడినా, ఆడకపోయినా ఆర్చర్ ఉండాల్సిందే! జోఫ్రాకి ముంబై ఇండియన్స్ నుంచి క్రేజీ ఆఫర్...

జోఫ్రా ఆర్చర్‌ని ఏడాది ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసి పెట్టుకుంది ముంబై ఇండియన్స్. గాయం కారణంగా 2022 సీజన్‌లో ఆడడని తెలిసినా, ఆర్చర్ మెగా వేలంలో పేరు రిజిస్టర్ చేసుకోవడం, అతన్నీ ముంబై ఇండియన్స్ రూ.8 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం జరిగిపోయాయి..
 

26
Jofra Archer

2023 సీజన్‌లో జస్ప్రిత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్ కలిసి ముంబై ఇండియన్స్‌కి మ్యాచులు గెలిపిస్తారని అనుకున్నారంతా. అయితే ఆర్చర్ అడుగుపెట్టిన వేళావిశేషం బుమ్రా గాయం కారణంగా 8 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు...

36

పోనీ ఆర్చర్ అయినా సరిగ్గా ఆడతాడని అనుకుంటే... ఒక్క మ్యాచ్ ఆడి మళ్లీ గాయపడిన జోఫ్రా ఆర్చర్, వరుసగా 3 మ్యాచులకు దూరమయ్యాడు. మొత్తంగా 5 మ్యాచులు ఆడి రెండే వికెట్లు తీసిన ఆర్చర్, గాయం తిరగబెట్టడంలో ఇంగ్లాండ్‌కి తిరిగి వెళ్లిపోయాడు..

46
Archer bowling nets

అయితే జోఫ్రా ఆర్చర్ మీద నమ్మకంతో అతనికి ఫుట్ టైమ్ కాంట్రాక్ట్ ఆఫర్ చేసిందట ముంబై ఇండియన్స్. ఈ కాంట్రాక్ట్ ప్రకారం ముంబై ఫ్రాంఛైజీ తరుపున ఐపీఎల్‌తో పాటు సౌతాఫ్రికా20, ఇంటర్నేషనల్ టీ20, మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీల్లో ఆడాల్సి ఉంటుంది..
 

56

జోఫ్రా ఆర్చర్‌కి ఏడాదికి మరో రూ.10 కోట్ల వరకూ చెల్లించేందుకు ముంబై ఇండియన్స్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో రిహాబ్ సెంటర్‌లో ఉన్న జోఫ్రా ఆర్చర్, ఈ కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాలంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పర్మిషన్ అవసరం..

66
Archer-Mumbai Indians

2021 ఫిబ్రవరి నుంచి టెస్టు క్రికెట్‌కి దూరంగా ఉన్న జోఫ్రా ఆర్చర్, ఈ ఏడాది యాషెస్ సిరీస్‌లో పాల్గొనబోతున్నాడు. మోచేతి గాయంతో బాధపడుతున్న ఆర్చర్, వచ్చే నెలాఖరు సమయానికి పూర్తిగా కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది ఈసీబీ..

click me!

Recommended Stories