ఐపీఎల్... వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్. అంతేకాదు వరల్డ్ మోస్ట్ పాపులర్ క్రికెట్ లీగ్. ఐసీసీ టోర్నీల కంటే ఎక్కువగా ఐపీఎల్ మ్యాచులకు ప్రపంచదేశాల్లో ఆదరణ దక్కుతోంది. ఐపీఎల్ అనే ఆలోచన పుట్టి, సరిగ్గా నేటికి 15 ఏళ్లు...
2008 ఏప్పిల్ 18న ఐపీఎల్ మొట్టమొదటి సీజన్, తొలి మ్యాచ్ జరిగింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో కేకేఆర్, రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ... ఐపీఎల్ మొదటి మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ప్లేయర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 73 బంతుల్లో 10 ఫోర్లు, 13 సిక్సర్లతో 158 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ క్రేజ్ ఒక్కసారిగా ఆకాశానికి ఎదిగిపోయింది...
210
అంతకంతకూ పెరుగుతూ పోయిన ఐపీఎల్ క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ బేస్... ఇప్పుడు దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన లీగ్‌గా మార్చేశాయి. ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డులెన్నో నమోదయ్యాయి.
310
Image credit: PTI
6844+ పరుగులు: ఐపీఎల్‌లో 6 వేల పరుగుల క్లబ్ క్రియేట్ చేసిన మొదటి ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, 6844 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. అతని తర్వాతి స్థానంలో శిఖర్ ధావన్ 6 వేల క్లబ్‌లో ఉండగా, త్వరలో రోహిత్ శర్మ కూడా ఈ క్లబ్‌లో చేరబోతున్నాడు..
410
Image credit: PTI
183 వికెట్లు: ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు డ్వేన్ బ్రావో. 170 వికెట్లు తీసిన లసిత్ మలింగను దాటేసిన డ్వేన్ బ్రావో, రిటైర్ కావడంతో 177 వికెట్లతో ఉన్న యజ్వేంద్ర చాహాల్, ఈ సీజన్‌లో బ్రావో రికార్డును దాటేయొచ్చు...
510
Image credit: Getty
6 సెంచరీలు, 357 సిక్సర్లు: ఐపీఎల్‌లో అత్యధికంగా 6 సెంచరీలు బాదాడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. రెండేళ్లుగా ఐపీఎల్‌కి దూరంగా ఉన్న క్రిస్ గేల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 357 సిక్సర్లు కొట్టి, అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గానూ టాప్‌లో ఉన్నాడు...
610
Image credit: Sandeep Rana
175 నాటౌట్: ఐపీఎల్ 2013 సీజన్‌లో పూణే వారియర్స్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లతో సునామీ సృష్టించి 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్. ఈ సంచలన ఇన్నింగ్స్‌కి 10 సీజన్లు కావస్తున్నా ఈ స్కోరుని ఇప్పటిదాకా ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు.
710
PTI Photo) (PTI04_05_2023_000367B)
703 ఫోర్లు: సిక్సర్లు బాదడంలో గేల్ తోపు అయితే ఫోర్లు కొట్టడంలో శిఖర్ ధావన్ ఎక్స్‌పర్ట్. ఐపీఎల్ 703 ఫోర్లు బాదిన శిఖర్ ధావన్, అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్‌గా తనకంటూ ఓ టాప్ రికార్డు సొంతం చేసుకున్నాడు...
810
177.09: ఐపీఎల్‌లో అత్యధిక స్ట్రైయిక్ రేటు ఉన్న బ్యాటర్ కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్. సిక్సర్లు, ఫోర్లతో విధ్వంసం సృష్టించే ఆండ్రే రస్సెల్ 177.09 స్ట్రైయిక్ రేటుతో పరుగులు సాధించాడు. గత సీజన్‌లో రస్సెల్ కాస్త స్లో అయినా అతని స్ట్రైయిక్ రేటు మాత్రం ఇంకా టాప్‌లోనే ఉంది..
910
Image credit: PTI
6.48: ఐపీఎల్‌లో బెస్ట్ ఎకానమీ బౌలర్‌గా నిలిచాడు రషీద్ ఖాన్. ఇంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడిన రషీద్ ఖాన్, ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కి వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు..
1010
Image credit: PTI
1442 డాట్ బాల్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, ఐపీఎల్ చరిత్రలో 1442 డాట్ బాల్స్ వేసి.. అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ రికార్డు కోసం మహ్మద్ సిరాజ్ గట్టిగా ప్రయత్నిస్తున్నా ఇప్పట్లో భువీని దాటడం అసాధ్యం...