డబ్బులు లేకుంటే చెప్పండి, చందాలు వేసుకుని టీమ్‌ని నిర్మిస్తాం... ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆవేదన..

Published : May 24, 2023, 03:44 PM IST

ఐపీఎల్‌లో 16 సీజన్లుగా టైటిల్ గెలవని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 9 సీజన్లు ఆడినా టైటిల్ గెలవని ఆర్‌సీబీ, ఈసారి కూడా ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరుత్సాహపరిచింది...

PREV
16
డబ్బులు లేకుంటే చెప్పండి, చందాలు వేసుకుని టీమ్‌ని నిర్మిస్తాం... ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆవేదన..

ఐపీఎల్ 2023 సీజన్‌లో 14 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐదో స్థానంలో నిలిచింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కి కచ్చితంగా చేరుకుని ఉండేది... అయితే కీలక మ్యాచ్‌లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది...
 

26
Image credit: PTI

16 సీజన్లుగా టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఫ్యాన్స్‌ని మరోసారి డిస్సప్పాయింట్ చేసింది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ ఓటమి తర్వాత అభిమానుల స్పందన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
 

36
Image credit: PTI

‘ఈ టీమ్ మేనేజ్‌మెంట్ మొత్తాన్ని రద్దు చేయండి. వాళ్ల వల్ల టీమ్‌కి ఎలాంటి లాభం లేదు. టీమ్‌ని అభిమానులకు ఇవ్వండి, మేం సరైన ప్లేయర్లతో టీమ్‌ని నిర్మిస్తాం. ఒకవేళ ఫండ్స్ లేకపోతే చందాలు వసూలు చేసి టీమ్‌ని నిర్మిస్తాం... ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అని ప్రతీసారీ ఆశపడడం, నిరాశపడడం అలవాటైపోయింది. ఇక మా వాళ్ల కాదు..  ’ అంటూ కామెంట్ చేశాడు ఓ ఆర్‌సీబీ అభిమాని..
 

46

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్ మినహా మిగిలిన ప్లేయర్లు అందరూ అట్టర్ ఫ్లాప్ అయ్యారు...

56

గత సీజన్‌లో బాగా ఆడిన దినేశ్ కార్తీక్‌తో పాటు షాబజ్ అహ్మద్, అనుజ్ రావత్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌కి అన్‌క్యాప్డ్ ప్లేయర్లే ప్రధాన బలంగా మారితే ఆర్‌సీబీకి వాళ్లే పెద్ద భారంగా మారారు...
 

66
RCB vs GT

సరైన బ్యాటింగ్ లైనప్‌ కానీ బౌలింగ్ యూనిట్ కానీ లేకుండా ఆర్‌సీబీ, ఎన్ని సీజన్లు ఆడినా టైటిల్ గెలవడం కష్టమేనని అంటున్నారు బెంగళూరు అభిమానులు.  బేస్ ప్రైజ్ ప్లేయర్లతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరితే, ఒక్కో ప్లేయర్లకు పదేసి కోట్లు పెట్టిన ఆర్‌సీబీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని వాపోతున్నారు.. 

click me!

Recommended Stories