ఆ రూల్ వాడుకుంటే, ధోనీ ఇంకో ఐదేళ్లు ఆడగలడు!... యూసఫ్ పఠాన్ సూపర్ ఐడియా...

First Published May 22, 2023, 6:08 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్‌తో ఆఖరి స్థానాల్లో నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్... ఈసారి ప్లేఆఫ్స్‌కి చేరాయి. 2019 సీజన్ తర్వాత ఈ రెండు జట్లు ఒకేసారి ప్లేఆఫ్స్ చేరడం ఇదే మొదటిసారి...
 

(PTI PhotoR Senthil Kumar)(PTI05_10_2023_000319B)

ఐపీఎల్ 2020 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన చెన్నై సూపర్ కింగ్స్, 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరి నాలుగోసారి టైటిల్ గెలిచింది. నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరలేకపోయింది ముంబై ఇండియన్స్...

MS Dhoni

2023 సీజన్‌లో ఐపీఎల్ టైటిల్ గెలిచి, రిటైర్మెంట్ ఇవ్వాలని మహేంద్ర సింగ్ ధోనీ భావిస్తున్నాడని చాలామంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్స్‌లో ఒకటైన సీఎస్‌కే క్రేజ్ సగానికి పడిపోతుంది...

(PTI PhotoManvender Vashist Lav)(PTI05_20_2023_000232B)


సీఎస్‌కేలో రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, అజింకా రహానే, దీపక్ చాహార్ వంటి ఎందరు ప్లేయర్లు ఉన్నా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీకి సమానం కారు, కాలేరు... దీంతో ధోనీ ఇప్పట్లో రిటైర్ కాకూడదని సీఎస్‌కే టీమ్ కూడా బలంగా కోరుకుంటోంది..

MS Dhoni

2023 సీజన్‌లో మోకాలి గాయంతో బాధపడుతూనే ఫ్యాన్స్ కోసం బ్యాటింగ్‌కి వస్తూ, 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని వాడుకుంటే ఇంకో ఐదేళ్లు ఈజీగా ఆడొచ్చని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్...

‘ధోనీకి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఓ వరం. ఈ వయసులో మాహీ 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఓ యంగ్ వికెట్‌ని ఎంచుకుని, మాహీని కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కి మాత్రమే వాడుకోవాలి. 

(PTI PhotoR Senthil Kumar)(PTI05_10_2023_000329B)

అతను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్. ఇప్పటికీ భారీ షాట్లు ఆడుతున్నాడు. మరో ఐదేళ్లు ఆడగల సత్తా అతనిలో ఉంది... కెప్టెన్‌గా కాకపోయినా, మెంటర్‌గా, ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా టీమ్‌పైన ఇంపాక్ట్ చూపిస్తాడు’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్..

వికెట్ల మధ్య పరుగెత్తడానికి ఇబ్బంది పడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ, వికెట్ కీపింగ్‌లో కూడా కాస్త తడబడుతున్నాడు. ఇంతకుముందు ధోనీ డీఆర్‌ఎస్ తీసుకుంటే, అంపైర్లు కూడా కచ్చితంగా అవుట్ అనే ఫిక్స్ అయ్యేవాళ్లు. ఈ సీజన్‌లో ధోనీ తీసుకునే డీఆర్‌ఎస్ నిర్ణయాలు కూడా తప్పుతున్నాయి..

కాబట్టి ప్లేయర్‌గా, కెప్టెన్‌గా వికెట్ కీపర్‌గా పూర్తి ఓవర్ల పాటు క్రీజులో ఉంటూ ఇబ్బందిపడే కంటే ఇంపాక్ట్ ప్లేయర్‌గా మ్యాచ్ చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి, ధనాధన్ సిక్సర్లతో ఫ్యాన్స్‌ని మురిపించి, టీమ్‌కి అవసరమైన పరుగులు చేస్తే సరిపోతుందనే యూసఫ్ పఠాన్ సలహా మాహీ ఫ్యాన్స్‌కి తెగ నచ్చేసింది. మరి ఎమ్మెస్‌‌డీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.. 

click me!