ఇంకా 8-9 నెలల సమయం ఉంది, ఇప్పుడే ఆ తలనొప్పి ఎందుకు... ఎం.ఎస్. ధోనీ కామెంట్స్...

First Published May 24, 2023, 9:23 AM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోబోతున్నాడని తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలాసార్లు ధోనీకి ఈ విషయం గురించి ప్రశ్న ఎదురైంది...

MS Dhoni

ఓ సారి తాను కెరీర్ లాస్ట్ ఫేజ్‌లో ఉన్నానని చెప్పిన ధోనీ, మరోసారి ‘నేను నా లాస్ట్ ఐపీఎల్ అని చెప్పలేదు, మీరే చేశారు’ అని కామెంట్ చేశాడు. తాజాగా చెన్నైలో జరిగిన మొదటి క్వాలిఫైయర్ సమయంలో మాహీకి మరోసారి ఇదే ప్రశ్న ఎదురైంది...

PTI PhotoManvender Vashist Lav)(PTI05_20_2023_000232B)

చెన్నై చెపాక్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో మొదటి క్వాలిఫైయర్ ఆడి గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్‌లో సీఎస్‌కేకి చెన్నైలో ఇదే ఆఖరి మ్యాచ్. దీంతో సొంత మైదానంలో ధోనీకి ఇదే ఆఖరి మ్యాచ్? అవుతుందా... అని ప్రశ్నించాడు కామెంటేటర్ హర్షా భోగ్లే...

MS Dhoni

‘ఏమో నాకు తెలీదు! అయినా రిటైర్మెంట్ గురించి ఆలోచించడానికి నాకు ఇంకా 8-9 నెలల సమయం ఉంది. ఇప్పటి నుంచే ఆ తలనొప్పి పెట్టుకోవడం ఎందుకు... 

Dhoni

నేను ఆడినా ఆడకపోయినా, టీమ్‌లో ఉన్నా బయట ఉన్నా ఎప్పుడూ చెన్నై సూపర్ కింగ్స్‌కి సపోర్ట్ చేస్తూనే ఉంటా. ఇంతకుముందు 8 టీమ్స్ ఉండేవి, ఇప్పుడు 10 అయ్యాయి. అందుకే మరోసారి ఫైనల్ ఆడబోతున్నాం అని చెప్పడం లేదు...

టీమ్‌లో ప్రతీ ఒక్కరూ ఇక్కడిదాకా రావడంలో తమవంతు పాత్ర పోషించారు. మిడిల్ ఆర్డర్‌కి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన టీమ్...
 

MS Dhoni

టాస్ ఓడిపోవడం మంచిదైంది.లేకుండా పరిస్థితి వేరేలా ఉండేది. రవీంద్ర జడేజా, మొయిన్ ఆలీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సపోర్టింగ్ స్టాఫ్ అంతా సంతోషంగా ఉన్నారు...

కెప్టెన్‌గా నేను ఫీల్డర్లకు చెప్పేది ఒక్కటే. నన్ను చూస్తూ ఉండండి, నేనేం చెబుతానో గమనిస్తూ ఉండండి... ’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. 

click me!