10 ఫైనల్స్, 8 మంది కెప్టెన్లు... అపొజిషన్‌లో కెప్టెన్ ధోనీ ఒక్కటే! మాహీ రికార్డు ఫీట్‌కి...

First Published May 27, 2023, 10:25 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ ఫైనల్ చేరింది. సీఎస్‌కే కెరీర్‌లో ఇది 10వ ఫైనల్ కాగా 10 సార్లు కూడా మహేంద్ర సింగ్ ధోనీయే కెప్టెన్‌గా వ్యవహరించాడు...
 

Dhoni-Hardik

చెన్నై సూపర్ కింగ్స్ 10 సార్లు ఫైనల్ చేరగా 7 మంది కెప్టెన్లతో మహేంద్ర సింగ్ ధోనీ తలబడ్డాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, ధోనీకి ఫైనల్‌లో ఎనిమిదో అపొజిషన్ కెప్టెన్...

PTI PhotoR Senthil Kumar)(PTI05_23_2023_000356B)

ఆరంగ్రేటం సీజన్ 2008లో ఫైనల్‌కి వెళ్లింది చెన్నై సూపర్ కింగ్స్. అప్పటి టైటిల్ విజేత రాజస్థాన్ రాయల్స్‌కి షేన్ వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 

PTI PhotoManvender Vashist Lav)(PTI05_20_2023_000345B)

2010 సీజన్‌లో రెండోసారి ఫైనల్ చేరింది చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి ముంబై ఇండియన్స్‌తో ఫైనల్‌లో తలబడింది సీఎస్‌కే. ముంబై ఇండియన్స్‌కి ది గ్రేట్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు..
 

2011 సీజన్‌లో ధోనీ టీమ్ మూడోసారి ఫైనల్ చేరింది. ఈసారి ఫైనల్‌కి వచ్చిన ఆర్‌సీబీకి డానియల్ విటోరీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్..

2012 సీజన్‌లో ధోనీకి ఫైనల్ ప్రత్యర్థిగా నిలిచాడు గౌతమ్ గంభీర్. 2012లో సీఎస్‌కేని ఓడించి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచింది.. 

2013లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్‌తో తలబడింది ధోనీ సేన. షేన్ వార్న్, గౌతమ్ గంభీర్ తర్వాత ఫైనల్‌లో సీఎస్‌కేని ఓడించిన మూడో సారథిగా నిలిచాడు రోహిత్ శర్మ...

PTI PhotoR Senthil Kumar)(PTI05_10_2023_000319B)

2015 సీజన్‌లో రోహిత్ సేన రెండోసారి ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ని చిత్తు చేసింది. రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో ఫైనల్‌కి వెళ్లింది సీఎస్‌కే. ఈసారి ధోనీకి ప్రత్యర్థిగా నిలిచాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియంసన్... అయితే మాహీ మ్యాజిక్ ముందు కేన్ మామ టీమ్ నిలవలేకపోయింది..

Ravindra Jadeja Dhoni

2019లో ముచ్చటగా మూడోసారి ధోనీ టీమ్‌ని ఓడించింది రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్. 2021లో ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని కేకేఆర్, ధోనీసేనతో తలబడింది. మాహీ టీమ్‌కి నాలుగో టైటిల్ దక్కింది..

MS Dhoni

2023 సీజన్ ఫైనల్‌లో ధోనీ టీమ్‌తో తలబడబోతున్న హార్ధిక్ పాండ్యా సేన...సీఎస్‌కేకి ఆరో ప్రత్యర్థి టీమ్ మాత్రమే. ఎందుకంటే ఇంతకుముందు ముంబై నాలుగు సార్లు, కేకేఆర్ రెండుసార్లు, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీ తలా ఓసారి సీఎస్‌కేతో ఫైనల్ ఆడాయి.

PTI PhotoManvender Vashist Lav)(PTI05_20_2023_000232B)

ఫైనల్‌లో ధోనీ టీమ్‌పై గెలిస్తే షేన్ వార్న్, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ తర్వాత మాహీ టీమ్‌పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్న కెప్టెన్‌గా నిలుస్తాడు హార్ధిక్ పాండ్యా. ఓడిపోతే డానియల్ విటోరి, సచిన్ టెండూల్కర్, కేన్ విలియంసన్, ఇయాన్ మోర్గాన్‌లతో కలుస్తాడు చిన్న పాండ్యా.. 

click me!