కివీస్ వెళ్లగానే మాట మార్చిన డెవాన్ కాన్వే.. న్యూజిలాండ్ ఫ్యాన్స్ విమర్శలతో యూటర్న్..!

First Published Jun 1, 2023, 5:11 PM IST

IPL 2023:  చెన్నై సూపర్ కింగ్స్  ఓపెనర్ డెవాన్ కాన్వే  మాట మార్చాడు.  కివీస్ వెళ్లగానే  ఐపీఎల్ విజయంపై ఇండియాలో చేసిన కామెంట్స్ పై యూటర్న్ తీసుకున్నాడు.

ఐపీఎల్-16  ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్   ఐదో సారి కప్ నెగ్గింది. ఈ సీజన్ లో  చెన్నై తరఫున అత్యధిక పరుగులు సాధించాడు ఆ జట్టు  ఓపెనింగ్ బ్యాటర్  డెవాన్ కాన్వే.   ఈ సీజన్ లో 16 మ్యాచ్ లలో 672 పరుగులు చేసిన కాన్వే..  ఐపీఎల్-16 లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో 15 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి  51.69 సగటుతో  672 పరుగులు చేశాడు.

రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి చెన్నైకి సూపర్ డూపర్ ఓపెనింగ్ భాగస్వామ్యాలను అందించిన కాన్వే.. ఐపీఎల్ -16 ఫైనల్ ముగిసిన తర్వాత తన కెరీర్ లో ఇది గ్రేటెస్ట్ విక్టరీ అని   అన్నాడు. కానీ  న్యూజిలాండ్ అభిమానులు ఈ కామెంట్స్ పై కాన్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో  కాన్వే మాట మార్చాడు.

Latest Videos


ఐపీఎల్ ముగిసిన తర్వాత కాన్వే మాట్లాడుతూ.. ‘వర్షం వల్ల  మా (సీఎస్కే) ఇన్నింగ్స్  కోసం చాలాసేపు వేచి చూశాం. దీంతో కాస్త నెర్వస్ గా అనిపించింది.   కానీ నేను రుతురాజ్ కలిసి   బాగా బ్యాటింగ్ చేశాం.   వ్యక్తిగతంగా నాకు ఇది కెరీర్ లోనే గ్రేటెస్ట్ విక్టరీ. దీనికంటే  పెద్ద విజయమేమీ లేదు...’అని కామెంట్ చేశాడు.

అయితే ఈ కామెంట్స్ పై  కివీస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం తరఫున కాకుండా ఒక ఫ్రాంచైజీ తరఫున ఆడుతూ అదే తన మొత్తం కెరీర్  లో పెద్ద విజయం అనడం ఏంటని  నిలదీశారు. దేశం కంటే ఫ్రాంచైజీనే గొప్ప అయితే  దానికే వెళ్లి ఆడుకోవాలని, జాతీయ జట్టు నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. 

విమర్శల నేపథ్యంలో   కాన్వే స్పందించాడు.  స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం ప్రకారం అది (ఐపీఎల్  - 16 ఫైనల్) నా టీ20 కెరీర్ లోనే బిగ్గెస్ట్ విక్టరీ.   నా కెరీర్ మొత్తంలో బెస్ట్ విన్ అని నేను చెప్పను.  కానీ టీ20లలో మాత్రం కచ్చితంగా అదే బెస్ట్ ఇన్నింగ్స్. 

న్యూజిలాండ్ తరఫున ఆడుతూ  డబ్ల్యూటీసీ ఫైనల్స్  లో విజయం సాధించడమే నాకు చాలా ప్రత్యేకమైంది. దానిని మించింది మరోకటి లేదని నేను భావిస్తున్నా..’అని అన్నాడు. కాగా 2021లో భారత్ -  న్యూజిలాండ్ మధ్య  జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో కాన్వే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 54 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 19 పరుగులు చేశాడు. కివీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కాన్వేనే టాప్ స్కోరర్.  

click me!