డేవిడ్ వార్నర్‌కి అంత సీన్ లేదు! ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ కూడా చేరదు.. - ఆకాశ్ చోప్రా కామెంట్...

Published : Mar 28, 2023, 03:34 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో కెప్టెన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టబోతున్నాడు డేవిడ్ వార్నర్. ఐపీఎల్ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌కి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్, 2021 సీజన్‌లో మేనేజ్‌మెంట్‌తో గొడవ పడి ఆ టీమ్ నుంచి బయటికి వచ్చేశాడు...

PREV
17
డేవిడ్ వార్నర్‌కి అంత సీన్ లేదు! ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ కూడా చేరదు..  - ఆకాశ్ చోప్రా కామెంట్...
Image credit: PTI

2022 మెగా వేలంలో డేవిడ్ వార్నర్‌ని కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఈ ఆసీస్ ప్లేయర్‌కి కెప్టెన్సీ అప్పగించింది. 37 ఏళ్ల డేవిడ్ వార్నర్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ తర్వాత రిటైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినబడుతోంది...
 

27
Image credit: PTI

ఈ సమయంలో డేవిడ్ వార్నర్‌కి ఓ రకంగా ఇది ఆఖరి ఐపీఎల్ సీజన్‌ కావచ్చు. దీంతో అతనిపై భారీ అంచనాలే పెట్టుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మేనేజ్‌మెంట్. 2020 సీజన్‌లో ఫైనల్ చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, 2021 సీజన్‌లో మూడో స్థానంలో నిలిచింది. 2023 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది...
 

37


‘ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందా? అని నేను ఆసక్తిగా చూస్తున్నా. పృథ్వీ షాతో కలిసి డేవిడ్ వార్నర్ ఓపెనింగ్ చేస్తాడు. మిచెల్ మార్ష్‌ని మూడో స్థానంలో ఆడించొచ్చు. మనీశ్ పాండే రూపంలో నెం.4 ప్లేస్‌కి ఓ సీనియర్ ప్లేయర్ ఉన్నాడు... అయితే కీపర్ సంగతేంటి?
 

47

మనీశ్ పాండే కానీ, మిచెల్ మార్ష్ కానీ వికెట్ కీపింగ్ చేయలేరు. రిలే రసో, రోవ్‌మన్ పావెల్‌లను ఐదు, ఆరు స్థానాల్లో ఆడించి, సర్ఫరాజ్ ఖాన్‌ని ఏడో స్థానంలో పంపించే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్ఫరాజ్ ఖాన్‌తో వికెట్ కీపింగ్ చేయించడమే ఢిల్లీకి మిగిలిన ఆప్షన్... కానీ సర్ఫరాజ్ ఖాన్ ఆ పనిని చేయగలడా?

57

అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ చూడడానికి పటిష్టంగానే ఉంది. అయితే ఆల్‌రౌండర్ల సంగతేంటి? అక్షర్ పటేల్ తప్ప ఢిల్లీ టీమ్‌లో బ్యాటర్లు బౌలింగ్ చేయలేరు, బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు.. అన్రీచ్ నోకియా, చేతన్ సకారియా, ఇషాం్త శర్మ, ముకేశ్ కుమార్.. ఢిల్లీ టీమ్‌లో ఫాస్ట్ బౌలర్లు బాగానే ఉన్నారు..
 

67

ఇప్పటిదాకా పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గెలవలేకపోయాయి. ఈసారి అయినా ఇవి టైటిల్ గెలుస్తాయా? అంటే నాకైతే అంత సీన్ కనిపించడం లేదు. నా ఉద్దేశంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి ప్లేఆఫ్స్ చేరడం కూడా కష్టమే...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

77


మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 2021 టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, తన తొలి మ్యాచ్‌ని ఏప్పిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది.. 
 

click me!

Recommended Stories